Hotels Turn Quarantine Centers : కరోనాతో ఇబ్బందుల్లో ఉన్న హోటళ్లకు క్వారంటైన్ వసతి తో ఊరట!
Hotels turn quarantine centres: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండంతో ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లు రోగులతో రద్దీగా మారిపోయాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో నిన్నమొన్నటి వరకు అతిథులకు వసతి కల్పించిన హోటళ్లు ఇప్పుడు కరోనా రోగులకు సేవలందిస్తున్నాయి.
ప్రభుత్వ హస్పిటల్ లో వైద్యం సరిగా లేదనే అపవాదుతో కరోన పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ప్రైవేట్ వైపు వెళ్తుండడంతో అక్కడ బెడ్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో తక్కువ సిమ్ టామ్స్ ఉన్నావారి కోసం త్రి స్టార్, అంతకంటే తక్కవ స్థాయి హోటళ్లలో ఐసోలేషన్ చేసి చికిత్స అందిస్తున్నారు. ఇటు కరోన నెపద్యంలో రాజదానిలో చిన్నా, పెద్ద హోటళ్ల వ్యాపారం పూర్తిగా దెబ్బతినడంతో హస్పిటళ్లు సరికొత్త ఆలోచన విధానంతో హోటళ్ళను క్వారంటైన్ సెంటర్లుగా ఏర్పాటు చేసి సెమి కొవిడ్ చికిత్సా కేంద్రాలుగా మార్చారు. నగరంలో పలు కార్పోరేట్ హస్పిటల్ లతో పాటు చిన్న హస్పిటల్ లు కూడ ఇలా హోటళ్లు, రిసార్ట్ లతో ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ప్రైవేట్ హస్పిటళ్లలో పూర్తిగా బెడ్లు నిండిపోవడం వల్ల చాలా వరకు హస్పిటల్ లు హోటళ్లను ఐసొలేషన్ సెంటర్లుగా మార్చి అందులో రోగులను ఉంచారని తెలంగాణ ప్రైవేట్ హస్పిటల్స్ నర్సింగ్ అసోసియోషన్స్ కార్యదర్శి డాక్టర్ మోహన్ గుప్త తెలిపారు. కొవిడ్ నుంచి కోలుకున్న వారిని అలాగే రకరకాల కారణాలతో ఇంటికి వెళ్ళలేని వారిని హోటళ్ళలో ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఉన్న వారు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండి చికిత్సను పొందుతారు. క్వారంటైన్ పిరియడ్ పూర్తయ్యేలోపు వారికి టెస్టులు చేయడంతో పాటు ఎలాంటి ఆహరం తీసుకోవాలో డాక్టర్లు సూచనలు చేస్తారు.
కరోనా వ్యాది నుండి కోలుకున్న వారు, తక్కువ లక్షణాలు ఉన్నవారు హోటళ్ళలో క్వారంటైన్ లో ఉండడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని త్రిస్టార్ హోటల్ నిర్వాహకులు చెప్తున్నారు. ఇంట్లో పిల్లలు, వృద్దులు ఉండడం వల్ల అక్కడ వైరస్ వ్యాప్తి కాకుండా ఉండడానికి క్వారంటైన్ లో ఉంటున్నారు. హస్పిటళ్లతో టై అప్ చేసుకొని వారు పంపించిన రోగులకు మాత్రమే బెడ్స్ అందుబాటులో ఉంటాయని క్వాలిటీ రెసిడెన్స్ జీఎం రవిష్ దవె తెలిపారు. హోటళ్లలో కొవిడ్ కి నాన్ కోవిడ్ కి ప్రత్యేకంగా ప్లోర్ లు ఏర్పాటు చేశామన్నారు. వారు రూంలో నుండి బయటకు రాకుండా తమ సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి అన్ని సౌకర్యాలు అందిస్తున్నట్లు చెప్పారు. రోగులకు కరోన నుండి కోలుకోవడానికి కావాల్సిన ఆహరాన్ని అందిస్తున్నామన్నారు. కరోనా తక్కువ లక్షణాలు ఉన్న వారు హోటల్ క్వారంటైన్ లో ఉండడం వల్ల రోగం తీవ్రత ఎక్కువగా ఉండే రోగులకు ఆసుపత్రుల్లో బెడ్స్ దోరకే అవకాశం ఉంది. ఇటు కరోనా ప్రభావంతో నష్టాల్లో ఉన్న హోటళ్ళ వ్యాపారానికి క్వారంటైన్ కాసులు కురిపిస్తుంది.