హైదరాబాద్‌లో ప్రమాదకరంగా మారిన హోర్డింగ్స్, యూనిపోల్స్...

Hyderabad: *ఎండాకాలంలో ఈదురు గాలులతో వర్షాలు పడే ఛాన్స్ *కూలిపోయే ప్రమాదంలో హోర్డింగ్స్, యూనిపోల్స్

Update: 2022-04-23 01:52 GMT

హైదరాబాద్‌లో ప్రమాదకరంగా మారిన హోర్డింగ్స్, యూనిపోల్స్...

Hyderabad: హైదరాబాద్‌లో హోర్డింగ్‌లు, యూనిపోల్స్‌ టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఎండాకాలంలో ఈదురు గాలులు బీభత్సం సృష్టిస్తుంటాయి. ఈ టైంలో హోర్డింగ్స్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఎక్కడ, ఎప్పుడు కూలి మీదపడుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. నగరంలో రెండు మూడు రోజుల నుంచి పలు చోట్ల గాలి, దుమారంతో వర్షం కురిసింది. హోర్డింగ్‌ లు, యూనిపోల్స్‌ ఉన్న చోట్ల గాలి, దుమారం స్థానికుల్లో ఆందోళన రేపింది. గతంలో హోర్డింగ్‌లు కూలి ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన సంఘటనలు నగరంలో కోకొల్లలు. గ్రేటర్‌లో ఫ్లెక్సీల ఏర్పాటుపై నిషేధం విధించినా హోర్డింగ్‌లు, యూనిపోల్స్‌ తొలగింపును ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

జీహెచ్‌ఎంసీ లెక్కల ప్రకారం నగరంలో అనుమతి ఉన్న హోర్డింగ్‌లు, యూనిపోల్స్‌ 2,651 ఉన్నాయి. గతంలో సర్వే చేపట్టి 333 అక్రమ హోర్డింగ్‌లు ఉన్నట్టు గుర్తించారు. తూతూమంత్రంగా తొలగింపు పనులు మొదలు పెట్టారు. వీటిలో దాదాపు రెండు, మూడు దశాబ్దాల క్రితం ఏర్పాటుచేసిన ఈ హోర్డింగ్‌ల్లో చాలా వరకు తుప్పు పట్టడం, నిర్వహణ లేమితో బలహీనంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో అకాల వర్షాలు కురిసినప్పుడు గంటకు 80-100 కి.మీ.ల వేగంతో గాలులు వీస్తాయి.

ఈ తాకిడికి నిర్మాణ స్థిరత్వం సరిగా లేని హోర్డింగ్‌లు, యూనిపోల్స్‌ తట్టుకునే అవకాశం లేదు. నిబంధనల ప్రకారం ప్రతి రెండు, మూడేళ్లకోసారి సంబంధిత ఏజెన్సీలు హోర్డింగ్‌లు, యూనిపోల్స్‌ స్థిరత్వంపై గుర్తింపు ఉన్న స్ట్రక్చరల్‌ ఇంజనీర్ల ద్వారా నివేదిక జీహెచ్‌ఎంసీకి సమర్పించాలి. కానీ, ఈ విషయాన్ని సంస్థలోని ప్రకటనల విభాగం అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవని విమర‌‌్శలు వస్తున్నాయి.

Tags:    

Similar News