ఉస్మానియా ఆసుపత్రికి రాష్ట్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాంటి ఆస్పత్రి ఇప్పుడు ప్రమాదానికి కేరఫ్ గా మారనుందా..? ఆసుపత్రి వ్యర్ధాలను నేరుగా మూసికి తరలించే విధంగా పనులు చేపడుతున్నారా..? సంబంధిత ఇంజనీర్‌లను సంప్రదించకుండ చేపడుతున్న ఈ పనులతో రానున్న రోజుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదా..? ఇప్పుడు ఈ నిర్మాణ పనులు ప్రారంభించడంతో మూసీ పరివాహక ప్రాంత వాసులు భయంతో వణికి పోతున్నారు. అసల ఈ పనులు పూర్తయితే ఎలాంటి అనార్ధాలు తలేత్తుతాయో వాచ్ దిస్ స్టోరీ.
నిత్యం వందల సంఖ్యలో ఇన్ పేషంట్లు అవుట్ పేషంట్లతో రద్ధీగా ఉండే ఆసుపత్రి ఉస్మానియా. 1300 పడకల కెపాసిటీ. 21 విభాగాలు, 11 ఆపరేషన్ థియేటర్లు ఈ ఆసుప్రతిలో ఉన్నాయి. రోజూ మైనర్, మేజర్ కలిపి దాదాపు వందకు పైగా సర్జరీలు జరుగుతుంటాయి. అలాంటి ఆసుపత్రికి ఇప్పటి వరకూ సివరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ లేదు. ఈ ప్లాంట్ ఉంటే ఆసుపత్రి వేస్టేజ్‌ని శుద్దీ చేస్తారు. దాని ద్వారా ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు.
అయితే ప్రస్తుతం ఆస్పత్రి నుంచి వెలువడే వ్యర్థాలను డ్రైనేజీ లైన్‌లో నేరుగా కలిపేస్తున్నారు. దానివల్ల ఇప్పటికే చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అది చాలదన్నట్లుగా ఇప్పుడు వ్యర్థాలను ఏకంగా మూసీలోకి వదిలేందుకు ప్రత్యేక పైపులైను నిర్మాణ పనులు చేపట్టడం ఆందోళన కలిగిస్తోంది.ఆసుప్రతిలోని ప్రమాదకర వ్యర్థాలు మూసీలో చేరడం వల్ల కొత్త వ్యాధులు విజృంభించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆసుపత్రి వేస్టేజ్ ని ముందుగా ఎస్‌టీపీ ప్లాంట్‌కు తరలించి శుద్ధి చేసిన తర్వాతే డ్రైనేజీలోకి వదలాల్సి ఉంటుంది. కానీ, ఇటీవల కురిసిన వర్షానికి ఉస్మానియా ఆసుపత్రిలోకి నీరు వచ్చాయని హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు 13 లక్షలను మంజూరు చేసి ఉస్మానియా డ్రైనేజీ పైప్‌లను నేరుగా మూసీలోని సివరేజీ లైన్‌కు కలిపేందుకు పనులు ప్రారంభించారు.
ఉస్మానియా ఆసుపత్రిలోని టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఇంజనీరింగ్ విభాగం అధికారుల అభిప్రాయాలను కూడా సేకరించకుండా పనులు చేపట్టినట్లు తెలుస్తోంది. దీని వల్ల కొత్త సమస్యలు వస్తాయని టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఇంజనీరింగ్ సెక్షన్ అధికారులు ఇప్పటికే ఆసుపత్రి అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. వ్యర్థాలను మూసీలో గానీ, సివరేజీ లైన్‌లో గానీ నేరుగా కలపకూడదు. అలా చేస్తే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చర్యలు తీసుకోంటుంది.గతంలో ఉస్మానియా ఆసుపత్రిలోకి వర్షపు నీరు రావడంతో ఇబ్బందులు తలెత్తాయి. మున్ముందు అలా జరగకుండా ఉండేందుకు ఉస్మానియాలోని డ్రైనేజీ పైప్‌లైన్‌ను మూసీలోని పైప్‌లకు కలుపుతున్నామని అధికారులు చెబుతున్నారు.