ఖైరతాబాద్ గణేషుని నిమజ్జనోత్సవం ఘనంగా ముగిసింది. భారీ గణేషుడు గంగమ్మ ఒడికి చేరే క్షణం కోసం ఆతృతగా ఎదురుచూసిన భక్తులు... భారీ గణనాథుడిని కనులారా దర్శించుకున్నారు. గతానికి భిన్నంగా ఈసారి అన్ని వినాయకుల కంటే ముందు.. ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం జరగడం విశేషం. ఉదయం ఆరు గంటలకే మొదలైన ఖైరతాబాద్ ద్వాదశదిత్య వినాయకుడి శోభాయాత్ర దారిపొడవునా జయజయధ్వానాలతో కొనసాగింది.
చరిత్రలో ఎన్నాడూ లేనంత త్వరగా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనమైంది. 62 ఏళ్ల చరిత్రలో కేవలం ఆరేడు గంటల్లోనే గంగమ్మ ఒడికి చేర్చి రికార్డు సృష్టించారు నిర్వాహకులు. నవరాత్రులూ విశేషపూజలందుకున్న ఖైరతాబాద్ ద్వాదశదిత్య గణపయ్యను.... భక్తుల కోలాహలం మధ్య ట్యాంక్‌బండ్ వద్ద నిమజ్జనం చేశారు. శోభాయాత్ర, వీడ్కోలును తిలకించే లక్షలాది మంది సాగరతీరానికి తరలివచ్చారు.ఏమైనా భాగ్యనగరానికే ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ గణేష్ శోభాయత్ర వైభవంగా సాగింది. భక్తుల ఆటపాటలు- భజన కోలాటాలతో మహా గణపతికి వీడ్కోలు పలికారు. చరిత్రలో ఏన్నాడూ లేనంత తొందరగా నిమజ్జనం చేయటం విశేషం. ప్రతీ ఏటా సాయంత్రం ఖైరతాబాద్ మహాగణపతిని తరలించే నిర్వాహకులు... ఈ దఫా ఉదయం 8గంటలకే శోభయాత్రను ప్రారంభించారు. పార్వతి తనయుడి నిమజ్జన కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలిరావటంతో.... హుస్సేన్‌సాగర్ పరిసరాలు జనసంద్రాన్ని తలపించాయి.
హుస్సేన్ సాగర్ ప్రాంతం ఏటు చూసినా ప్రజల ఆటపాటలతో సందడిగా మారింది. అత్యంత కోలాహలం నడుమ ఖైరతాబాద్ గణేషుడు నిమజ్జనానికి బయలుదేరాగా.. భారీ క్రేన్ సాయంతో ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం చేశారు. ఈ వేడుకను చాలామంది ప్రత్యక్షంగా తిలకించి తన్మయత్వం చెందారు. రికార్డు సమయంలో ఈసారి ఖైరతాబాద్ భారీ గణనాథుడి నిమజ్జనోత్సవం ముగియడం విశేషం. ఉదయం 8 గంటలకు శోభాయాత్రగా బయలుదేరిన గణనాథుడు మధ్యాహ్నం 2 గంటల్లోపే నిమజ్జనం పూర్తిచేసుకున్నారు. ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ భారీ వినాయకుడి నిమజ్జనం ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
ఖైరతాబాద్ గణేషున్ని దర్శించుకుంటే ఆల్ మోస్ట్ అన్ని దేవుళ్ల దగ్గరికి వెళ్లినట్టే. గణపతికి రెండు వైపులా వేర్వేరు దేవుళ్లను ప్రతిష్టించడం ఏటా వస్తున్న ఆనవాయితి. ఇలా 63 ఏళ్లలో 30కి పైగా రూపాల్లో దేవతామూర్తులను నిలిపారు నిర్వాహకులు. ఎక్కడో ఉన్న దేవతామూర్తులను కూడా దర్శనం చేసుకునేలా.. ప్రతి ఏటా రెండు విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. 27 ఏళ్ళుగా ఈ ఆనవాయితీ కొనసాగుతూనే ఉంది. ఏమైనా ఖైరతాబాద్ లంబోదరుడి దర్శనం కోసం భక్తులు లక్షల్లో వస్తుంటారు. చవితి పండుగ ముందు నుంచి నిమజ్జనం వరకు.. గణేషుని దగ్గర ఇసుకేసినా రాలనంతా జనాలు కనిపిస్తుంటారు. ఈసారి కూడా రికార్డు స్థాయిలో భక్తులు.. ఖైరతాబాద్ భారీ గణేషున్ని దర్శించుకున్నారు. అదే స్థాయిలో వీడ్కోలు పలికారు.