జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీ ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు

* ఎన్నికల ప్రక్రియ రెండు నెలల్లోగా పూర్తి చేయాలన్న కోర్టు * అర్హులైన ఓటర్లతో కొత్త జాబితాను సిద్ధం చేయాలని ఆదేశం * పర్సనల్‌ ఇన్‌చార్జి కమిటీ తుది పరిశీలన అనంతరం..

Update: 2021-01-06 06:15 GMT

జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీ ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియ రెండు నెలల్లోగా పూర్తి చేయాలన్న కోర్టు అర్హులైన ఓటర్లతో కొత్త జాబితాను తయారు చేసి ప్రచురించాలని ఆదేశించింది. ప్రచురించిన తేదీ నుంచి కనీసం రెండు వారాల గడువిచ్చి అభ్యంతరాలు, క్లయిమ్‌లు స్వీకరించాలని చెప్పింది. పర్సనల్‌ ఇన్‌చార్జి కమిటీ తుది పరిశీలన అనంతరం  ఫైనల్‌ ఓటరు జాబితాను తెలంగాణ రిజిస్ట్రార్‌ కమ్‌ కోఅపరేటివ్‌ సొసైటీకి పంపాలని వెల్లడించింది. జాబితాలో మార్పులు చేర్పులను రిజిస్ట్రార్‌ కోఆపరేటివ్‌ సొసైటీ ధృవీకరించాలని తెలిపింది. రిజిస్ట్రార్‌ ఆమోదించిన ఓటరు లిస్ట్‌ను పర్సనల్‌ ఇన్‌చార్జ్‌ కమిటీ స్టేట్‌ కోఆపరేటివ్‌ ఎలక్షన్‌ అథారిటీకి అందించాలని ఆదేశించింది హైకోర్టు.

Tags:    

Similar News