భారీ వర్షాలతో కూలుతున్న గోల్కొండ కోట గోడలు

గ్రేటర్ సిటీగా పిలువబడే హైదారాబాద్ కు తలమానికంగా, నగరంలోనే ప్రధాన పర్యాటక ఆకర్షణగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఈ నవాబుల ఖిల్లా. ఈ కోట చరిత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక్క సారి ఈ ప్రదేశాన్ని సందర్శించిన వారు ఓ అద్భుతాన్ని చూసిన అనుభూతికి లోనవుతారు.

Update: 2020-10-20 13:44 GMT

గ్రేటర్ సిటీగా పిలువబడే హైదారాబాద్ కు తలమానికంగా, నగరంలోనే ప్రధాన పర్యాటక ఆకర్షణగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఈ నవాబుల ఖిల్లా. ఈ కోట చరిత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక్క సారి ఈ ప్రదేశాన్ని సందర్శించిన వారు ఓ అద్భుతాన్ని చూసిన అనుభూతికి లోనవుతారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు 11 కిలోమీటర్ల దూరంలో గోల్కొండ కోట ఉంది.

ఈ కోట నిర్మాణం జరిగి 500 సంవత్సరాలు గడిచింది. ఇన్ని సంవత్సరాలలో ఎన్ని విపత్తులు వచ్చినా, ఎన్ని రాజ్యాలు దండెత్తినా తట్టుకుని నిలబడి నవాబుల పాలనకు, చరిత్రకు సాక్ష్యంగా గోల్కొండ నిలిచింది. కోట లోపల ఎన్నో విశేషమైన కట్టడాలు ఉంటాయి. శత్రువుల నుంచి రక్షించుకునేందుకు కోట నిర్మాణం సమయంలోనే 10 కిలోమీటర్ల పరిధిలో 87 అర్ధచంద్రాకార బురుజులను నిర్మించారు. ఇప్పటికీ కొన్ని బురుజులలో ఫిరంగులు కనిపిస్తాయి.

గోల్కొండ కోట 8 ప్రధాన సింహ ద్వారాలు, 4 ఎత్తగలిగే వంతెనలు, అనేక రాజ మందిరాలు, ఆలయాలు, మసీదులతో నేటికీ ఎంతో వైభవంగా కనిపిస్తుంది. ఒకప్పుడు భాగ్యనగరం శివార్లలో ఉండే గోల్కొండ ఇప్పుడు నగరంలో అంతర్భాగంగా, వారసత్వ సంపదగా విరాజిల్లుతుంది.అలాంటి ఘన చరిత్ర కలిగిన గోల్కొండ కోటపై వరుణుడి ఎఫెక్ట్ పడింది. భారీ వర్షాలకు చారిత్రక గోల్కొండలోని ఓ భాగం ధ్వంసమైంది. కటోరా హౌజ్ గోడ కూలినేలమట్టం అయింది.

Tags:    

Similar News