Bathukamma Festival: పల్లెబాట పట్టిన నగరవాసులు

Bathukamma Festival: దసరాకు సొంతూళ్లకు పయనమవుతున్న ప్రజలు * పండుగ రద్దీతో కిక్కిరిసిన రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు

Update: 2021-10-13 02:52 GMT

పండుగ సందర్బంగా రద్దీగా మరినా బస్సు స్టాండ్లు (ఫైల్ ఇమేజ్)

Bathukamma Festival: బతుకమ్మ, దసరా పండగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్‌లోని ప్రధాన బస్‌స్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా రద్దీకి తగ్గట్లు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాట్లు చేసింది. ఇప్పటి వరకు కోటి 30 లక్షల మందిని వివిధ ప్రాంతాలకు ఆర్టీసీ తరలించింది. అటు దక్షిణ మధ్య రైల్వే సైతం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.

తెలంగాణలో సద్దుల బతుకమ్మ పండుగ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రధాన బస్‌స్టేషన్‌లు అయిన JBS, MGBSలు ప్రయాణికులతో రద్దీగా మారాయి. ఇప్పటి వరకు 3000కు పైగా ప్రత్యేక బస్సులు నడిపించారు. నిన్న ఒక్కరోజే 767 బస్సులు వివిధ ప్రాంతాలకు వెళ్లాయి. ప్రయివేట్ ట్రావెల్స్ చార్జీలు అధికంగా ఉండడం, ఆర్టీసీ అదనపు చార్జీలు తొలగించడం వల్ల ప్రయాణికులు ఆర్టీసీ వైపు మొగ్గుచూపిస్తున్నారని అధికారులు అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారి కోసం దక్షిణ మధ్య రైల్వే 16 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిందని దక్షిణ మధ్య రైల్వే CPRO రాకేష్ తెలిపారు. ప్రయాణికుల రద్దీ ఎక్కడైతే అధికంగా ఉంటుందో అక్కడకి మరిన్ని ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. ఉదయం నుండి రైల్వే స్టేషన్‌కు ప్రయాణికులు భారీగా చేరుకుంటున్నారు.

Tags:    

Similar News