ఆరు గంటల్లో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Update: 2020-09-20 11:47 GMT

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఆరు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఆ మేరకు హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరశాఖ తెలిపింది.

ముఖ్యంగా తెలంగాణలోని ఆదిలాబాద్, కుమరంభీం, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని నిర్మానుష్య ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మెట్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.

అదే విధంగా రేపు కూడా రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.ఇక పొతే గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు నదులు, చెరువులు, కుంటలు నిండు కుండలను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ఎక్కువగా రావడంతో ఆయా ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

Tags:    

Similar News