బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలంగాణలో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు

Weather Forecast Today: * ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఛాన్స్ * పలు జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాలు

Update: 2021-08-29 01:50 GMT

తెలంగాణలో రెండ్రోజులు పాటు భారీ వర్షాలు

Weather Forecast Today: బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు విస్తారంగా కురుస్తాయని పేర్కొంది. ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు తెలిపారు. ఈరోజు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, వరంగల్‌ జిల్లాల్లో ఒకటి రెండు ప్రదేశాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌, ఖమ్మం, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని చెప్పారు.

Tags:    

Similar News