Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎప్పటి కప్పుడు మారిపోతుంది. ఉదయం వేళ కాస్త ఎండలు ఉన్నప్పటికీ మధ్యాహ్నం తర్వాత వానలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడినట్లు వాతావరణంలో మార్పులు వచ్చినప్పటికీ చూస్తే చిన్నగా కురిసి ఆగిపోతున్నాయి. ఈ క్రమంలోనే శని, ఆదివారాల్లో రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వానలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్ని చోట్ల ఆకాశం మాత్రం మేఘావృతమై ఉండనుందని తెలిపింది.
నైరుతి మధ్యప్రదేశ్ ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతుండగా, ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఆదివారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది. మరోవైపు, పశ్చిమబెంగాల్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా 2.8 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఈ ద్రోణి కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురవనున్నాయి. అటు ఆంధ్రప్రధేశ్లో నూ ద్రోణి కారణంగా శనివారం నుంచి నాలుగు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ, అమరావతి వాతావరణ కేంద్రాలు తెలిపాయి. శనివారం ఉత్తరాంధ్ర, యానాంలోను, ఆదివారం ఉత్తరాంధ్ర, యానాంతో పాటు దక్షిణకోస్తాలోను, 10, 11 తేదీల్లో దక్షిణకోస్తా, సీమల్లో భారీ వర్షాలు, ఇతర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు అంటున్నారు.