Heavy Rains: భద్రాద్రి కొత్తగూడెంలో భారీ వర్షాలు
Heavy Rains: పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
Heavy Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో పాల్వంచలోని కిన్నెరసాని జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో నిండుకుండను తలపిస్తుంది. డ్యాం పూర్తి సామర్థ్యం 407 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 405.10 అడుగులు చేరింది.
ఇన్ ఫ్లో 10 వేల క్యూసెక్కులు ఉందని వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తామని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. దీంతో కిన్నెరసాని పరివాహక ప్రాంతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు రావాలని, వాగులు, వంకలు ఎవరు దాటవద్దని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.