Nizamabad: 33,429 ఎకరాల్లో పంట నష్టం.. ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న రైతులు

Nizamabad: గత 20 రోజుల క్రితం వేసిన వరి నాట్లు నీటమునిగడం తీరని నష్టాలకు గురి చేసింది.

Update: 2023-07-29 05:22 GMT

Nizamabad: 33,429 ఎకరాల్లో పంట నష్టం.. ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న రైతులు  

Nizamabad: వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు రైతులకు తీవ్ర నష్టం కలిగించాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 33వేల 429 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్టు వ్యవసాయాధికారులు లెక్క తేల్చారు. అనధికారికంగా మరింత నష్టం వాటిల్లినట్టు రైతులు వాపోతున్నారు. భారీ వర్షాలతో పంటపొలాలు నీటమునిగి ఇసుక మెటలు పెట్టడం మరింత తీరని నష్టం వాటిల్లిందని అన్నదాతలు వాపోతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరి, సోయా, మొక్కజొన్న, పసుపు పంటలు దెబ్బతిన్నాయి. గత 20 రోజుల క్రితం వేసిన వరి నాట్లు నీటమునిగడం తీరని నష్టాలకు గురి చేసింది.

Tags:    

Similar News