Rain Alert: తెలంగాణ‌కు వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌

Rain Alert: తెలంగాణ కు "రెడ్ వార్నింగ్" ఇచ్చింది హైదరాబాద్ వాతావరణ శాఖ.

Update: 2021-06-09 12:03 GMT

Rain Fall (File Photo)

Rain Alert: తెలంగాణ కు "రెడ్ వార్నింగ్" ఇచ్చింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఈశాన్య బంగాళాఖాతం ,తూర్పు మధ్య బంగాళాఖాతంలో 4.5 -5 కిమి మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ఈ నెల 11 న అల్పపీడనం గా మారుతుందని జూన్ 12 ,13 తేదీల్లో తెలంగాణ కు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయ‌ని వాతావర‌ణ శాఖ వెల్ల‌డించింది. హైదరాబాద్ వాతావరణ అధికారి నాగరత్న మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించి ఉన్నాయని తెలిపారు. ఆదిలాబాద్ ,కొమురంభీం, మంచిర్యాల జిల్లాలో ఇంకా వ‌ర్షాలు ఆల‌స్యం అవ‌కాశం ఉందని అన్నారు.

ఇక‌ వచ్చే 2 రోజులు ఉత్తర జిల్లాలో జయశంకర్ భూపాలపల్లి, కొమరం భీం , ములుగు ,వరంగల్ అర్బన్ ,రూరల్ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుసే అవకాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారి తెలిపారు. గత 24 గంటల్లో కామారెడ్డి దోమకొండ లో 15 సెమి,హన్మకొండ లో 12,హుజురాబాద్ లో 9 సెమి ల వర్షం కురిసింది..కొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ నుండి అతి భారీ వర్షాలు కురిశాయి. తెలంగాణ‌లో మ‌రోసారి భారీ వర్షాలు ఉండనున్నాయని తెలిపారు..

గ‌తంలో వ‌ర్షాల‌కు న‌గ‌రంలో చెరువులు పొంగిపోర్లిన విష‌యం తెలిసిందే. దాదాపు వారంరోజుల పాటు న‌గ‌రంలో జ‌న‌జీవ‌నం స్థంభించిపోయింది. హైద‌రాబాద్ లో వ‌ర‌ద‌నీరు కాల‌నీల్లో కి చేరి ప్ర‌జ‌లు అవ‌స్థలు ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో ముందుగానే అధికారుల‌ను అలెర్ట్ చేసిన‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారి తెలిపారు. భారీ వర్షాలకు రెడ్ కలర్ కూడా ఇచ్చం.. ఈ అల్పపీడన ప్రభావం ఉత్తర ఈశాన్య జిల్లాలో అధికంగా ఉండనుంది...ప్రభుత్వానికి, అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్,డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సమాచారం అందించాం..అయితే హైదరాబాద్ లో ఎక్కువగా వర్షం ఉండదు..ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపాం అని చెప్పారు . 

Tags:    

Similar News