Weather Report: తెలంగాణకు భారీ వర్ష సూచన

Weather Report: దీని ప్రభావంతో తెలంగాణ లో మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది

Update: 2022-08-16 01:55 GMT

Weather Report: తెలంగాణకు భారీ వర్ష సూచన

Weather Report: తెలంగాణకు భారీ వర్ష సూచనల అందుతోంది. ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాయుగుండం వాయవ్య దిశగా ప్రయాణించి వాయవ్య ఛత్తీస్‌గఢ్‌, తూర్పు మధ్యప్రదేశ్‌లో కొనసాగినట్టు వాతావారణ కేంద్రం వెల్లడించింది. ఈ వాయుగుండం పశ్చిమ, వాయవ్య దిశగా కదిలి బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో తెలంగాణ లో మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 19వరకు రాష్ట్రంలో ఇవే పరిస్థితులుంటాయని పేర్కొంది. ఇక గడిచిన 24 గంటల్లో ఆసిఫాబాద్‌ జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Tags:    

Similar News