ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్ష బీభత్సం
Karimnagar: *అకాల వర్షంతో అపార నష్టం *తడిసి ముద్దయిన ధాన్యం
Karimnagar: రాత్రి కురిసిన అకాల వర్షంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. చేతికి వచ్చిన ధాన్యం తడిసి ముద్దయింది. జోరు వానతో పంటలు నేలమట్టమయ్యాయి. పెద్దపల్లి జిల్లా ఓదెల, సుల్తానాబాద్, కాల్వశ్రీరాంపూర్ ,మండలాల్లో రాత్రి భారీ ఈదురు గాలులతో కురిసిన అకాల వర్షానికి రైతుల అమ్ముకోవడానికి సిద్ధంగా ఉంచిన మార్కెట్ లోని వరి ధాన్యం మొక్కజొన్న తడిసి ముద్దయ్యాయి. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో అకాల వర్షం తో తడిసి పోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
కోతకు సిద్ధంగా ఉన్న వరి పైరు మొక్కజొన్న పలుచోట్ల నేలకొరిగాయి. పంట చేతికొచ్చే సమయంలో ఒక్కసారిగా వచ్చిన వర్షానికి ధాన్యం తడిసి పోవడంతో ఏమి చేయాలో తెలియడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల కాంట అయిన బస్తాలు తడిసి పోయాయి. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.