Heavy Rains In Hyderabad: హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం..తెల్లవారుజామున భారీ వర్షం

Heavy Rains In Hyderabad: హైదరాబాద్ లో వర్షం దంచికొడుతోంది. మంగళవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఆకాశానికి చెల్లు పడిందా అన్నట్లు వర్షం పడుతోంది. హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం సాయంత్రం నుంచే భారీ వర్షం పడుతోంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి హైదరాబాద్ లో రోడ్లన్నీ వర్షం నీటితో నిండిపోయాయి.

Update: 2024-08-20 00:23 GMT

Heavy Rains In Hyderabad: హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం..తెల్లవారుజామున భారీ వర్షం

Heavy Rains In Hyderabad: హైదరాబాద్ లో వర్షం దంచికొడుతోంది. మంగళవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఆకాశానికి చెల్లు పడిందా అన్నట్లు వర్షం పడుతోంది. హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం సాయంత్రం నుంచే భారీ వర్షం పడుతోంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి హైదరాబాద్ లో రోడ్లన్నీ వర్షం నీటితో నిండిపోయాయి. వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా నిజామాబాద్ జిల్లాలో రైల్వే అండర్ పాస్ కింద ఆర్టీసీ బస్సు వరదల నీటిలో చిక్కుకుంది.

హైదరాబాద్ నగరంలో సోమవారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం తెల్లవారుజామున కుండపోత వాన పడింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో నగరవాసులు తడిసి ముద్దయ్యారు. బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్​బాగ్, లిబర్టీ, హిమాయత్​నగర్, నారాయణగూడ, లక్డీకాపుల్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో రహదారులన్నీ వర్షం నీటితో నిండిపోయాయి. షేక్‌పేట, ఫిలింనగర్, గచ్చిబౌలి మార్గంలో సోమవారం సాయంత్రం భారీగా ట్రాఫిక్‌జామ్‌ అయ్యింది. మెహిదీపట్నం, టోలిచౌకి మార్గంలో వాహనాలు గంటలపాటు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

అటు కూకట్‌పల్లి, హైదర్‌నగర్, బాచుపల్లి, మూసాపేట్‌, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కుత్బుల్లాపూర్‌, గాజుల రామారం, జగద్గిరిగుట్ట, బహదూర్‌పల్లి, సూరారం, సుచిత్ర, గుండ్లపోచంపల్లి, పేట్ బషీరాబాద్, జీడిమెట్ల, బోయిన్‌పల్లి, ప్రగతి నగర్‌, బేగంపేట, తిరుమలగిరి, అల్వాల్, మారేడుపల్లి, కూకట్‌పల్లి, హైదర్‌నగర్, బాచుపల్లి, మూసాపేట్‌లోనూ వర్షం పడింది.

మంగళవారం తెల్లవారు జామునుంచి సికింద్రాబాద్, బోయిన్ పల్లి, తిరుమలగిరి, అల్వాల్, సుచిత్ర, కోంపల్లి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ప్రజలు అత్యవసరం అయితే బయటకు రావాలంటూ జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నారు. భారీ వర్షానికి నాలాలు ప్రమాదకరస్థితిలో పొంగిపోర్లుతుండటంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమయ్యింది. ఉప్పల్, రామంతాపూర్, హబ్సిగూడ , నాగోల్, తార్నాక ఏరియాలో కుండపోత వర్షం కురుస్తోంది. 

Tags:    

Similar News