Taliperu Project: తాలిపేరు ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి.. 24 గేట్లు ఎత్తివేత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు మధ్య తరహా ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరుగుతోంది.
Taliperu Project: అల్పపీడన ప్రభావంతో ఎగువ ప్రాంతంలోని ఛత్తీస్‌ఘడ్ అడవులలో భారీ వర్షాలు కురుస్తుండటంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి కొనసాగుతోంది. రిజర్వాయర్‌లోకి భారీగా వరద చేరుకుంటుండటంతో అధికారులు అప్రమత్తమైయ్యారు. ప్రాజెక్ట్ 25 గేట్లలో 24 గేట్లను ఎత్తి 59 వేల 330 క్యూసెక్కుల వరదను గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 74 మీటర్లు కాగా ప్రస్తుతం నీటిమట్టం 72.55 మీటర్లు వద్ద ఉంచి మిగులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.