MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ

MLC Kavitha: ఈడీ తరపున ముగిసిన లాయర్ జోహెబ్ హుస్సేన్ వాదనలు

Update: 2024-05-28 10:17 GMT

 MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ

 MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈడీ తరపున న్యాయవాది జోహెబ్ హుస్సేన్ వాదనలు వినిపిస్తున్నారు. నిన్న ఎమ్మెల్సీ కవిత తరపున వాదనలు ముగిశాయి. లిక్కర్ కేసులో కవిత కింగ్‌ పిన్ అని... లిక్కర్ కేసులో అక్రమ సొమ్ము కవితకు చేరిందని జోహెబ్ హుస్సేన్ కోర్టుకు తెలిపారు. దీనికి సంబంధించి వాట్సాప్ చాట్స్ తమ దగ్గర ఉన్నాయని చెప్పారు. ఇండియా ఎహెడ్ ఛానల్‌లో పెట్టుబడి పెట్టారని అన్నారు. ఫోన్లలోని డేటాను ధ్వంసం చేశారని జోహెబ్ హుస్సేన్ కోర్టుకు తెలిపారు. ఈడీకి ఇచ్చిన ఫోన్లలోని డేటాను ఫార్మాట్ చేసినట్టు ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చిందని తెలిపారు. డిజిటల్ డేటా ధ్వంసంపై పొంతనలేని సమాధానాలు ఇచ్చారని జోహెబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు.

లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కవిత బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారించింది. నిబంధనలు, చట్ట ప్రకారమే కవిత అరెస్ట్ జరిగిందని సీబీఐ తరపు లాయర్ తెలిపారు. లిక్కర్ కేసులో కవిత ప్రమేయం ఉందన్నారు. లిక్కర్ పాలసీ ద్వారా కవిత లబ్ధి పొందారని చెప్పారు. లిక్కర్ కేసు కీలక దశలో ఉందని... కవితకు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని తెలిపారు. కవితకు బెయిల్ ఇవ్వడానికి మెడికల్ కారణాలు లేవని సీబీఐ తరపు లాయర్ వాదనలు వినిపించారు.

Tags:    

Similar News