Harish Rao: కాంగ్రెస్ ఏడాది పాలనపై ఛార్జ్ షీట్

Harish Rao: కాంగ్రెస్ ఏడాది పాలనపై మాజీ మంత్రి టిఆర్ఎస్ నాయకులు హరీష్ రావు ఆదివారం తెలంగాణ భవన్లో చార్ సీట్ విడుదల చేశారు.

Update: 2024-12-08 08:14 GMT

Harish Rao: కాంగ్రెస్ ఏడాది పాలనపై ఛార్జ్ షీట్

Harish Rao: కాంగ్రెస్ ఏడాది పాలనపై మాజీ మంత్రి టిఆర్ఎస్ నాయకులు హరీష్ రావు ఆదివారం తెలంగాణ భవన్లో చార్ సీట్ విడుదల చేశారు. ఏడాది పాలన ఎడతెగని వంచన పేరుతో ఆ పార్టీ ఛార్జిషీట్‌ను విడుదల చేసింది. ఏడాదిపాలనలో ప్రజాస్వామ్యం అపాస్యమైందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ఎప్పుడూ చూడని నిర్బంధాన్ని చూస్తున్నామని ఆయన చెప్పారు.

ముఖ్యమంత్రి సొంత ఊరుకు వెళ్లాలంటే పోలీస్ స్టేషన్లో అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయని ఆయన ఆరోపించారు. ఖమ్మం లో వర్షాలకు వరద సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆయన విమర్శించారు. ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

Tags:    

Similar News