Congress Manifesto: కాంగ్రెస్ మేనిఫెస్టోపై రాహుల్‌కు లేఖ రాసిన హరీశ్ రావు

Congress Manifesto: కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోపై అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు లే‌ఖ రాశారు.

Update: 2024-04-05 12:45 GMT

Congress Manifesto: కాంగ్రెస్ మేనిఫెస్టోపై రాహుల్‌కు లేఖ రాసిన హరీశ్ రావు

Congress Manifesto: కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోపై అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు లే‌ఖ రాశారు. ‎మేనిఫెస్టోల పేరుతో మోసపూరిత హామీలు ఇచ్చి... ఓట్లు దండుకుని, తర్వాత వాటిని విస్మరించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని చాలాసార్లు రుజువైందన్నారు. మళ్లీ మేనిఫెస్టోల పేరుతో ప్రజలను మోసం చేయవద్దని ఆ లేఖలో హరీశ్ సూచించారు.

బీఆర్ఎస్ పార్టీ టికెట్‌తో గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని, వారికే ఎంపీ టికెట్ కూడా ఇచ్చారని, పార్టీ మారిన వెంటనే పదవి పోయేలా చట్టం తీసుకొస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు హరీశ్... ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టడానికి అరచేతిలో స్వర్గం చూపిస్తూ... హామీలను ఇవ్వడం, ఆ తర్వాత వాటిని అమలు చేయలేక చేతులెత్తేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని ఎద్దేవా చేశారు.

2004, 2009 ఎన్నికల సందర్భంగా ఎన్నో హామీలను గుప్పిస్తూ మ్యానిఫెస్టోలను విడుదల చేశారని, రెండు సందర్భాల్లోనూ అటు కేంద్రంలో.. ఇటు ఏపీలో మీరే అధికారంలోకి వచ్చారని, కానీ... అప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు హరీశ్ రావు.. 2023 లో కూడా తెలంగాణలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, ఆ తర్వాత అన్ని హామీలను విస్మరించారని ఆ లేఖలో దుయ్యబట్టారు.

పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసి.. మళ్లీ మీరు తెలంగాణలో పర్యటిస్తున్నారని, అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అనేకసార్లు మాటతప్పిన మీరు... మళ్లీ ఏ నైతిక ధైర్యంతో మ్యానిఫెస్టో విడుదల చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారాయన... అసలు మీ మేనిఫెస్టోలకు ఏమైనా విలువ ఉందా ? ఒక్కదానినైనా అమలు చేశారా..? అలాంటి వారికి మేనిఫెస్టోలు ఎందుకు అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఇప్పుడిచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

Tags:    

Similar News