భట్టికి మంత్రి హరీష్ సవాల్.. అక్కడే తేల్చుకుందాం పదండి..
Harish Rao: ఉద్యోగ నోటిపికేషన్ల ప్రకటనతో కాంగ్రెస్, బీజేపీకి వణుకు పుట్టిందని మంత్రి హరీష్‌రావు అన్నారు.
Harish Rao: ఉద్యోగ నోటిపికేషన్ల ప్రకటనతో కాంగ్రెస్, బీజేపీకి వణుకు పుట్టిందని మంత్రి హరీష్‌రావు అన్నారు. భట్టి ప్రసంగంలో రాజకీయ విమర్శలు తప్పా.. సూచనలేవి లేవని మంత్రి హరీష్‌రావు ఎద్దెవా చేశారు. బడ్జెట్‌మీద అవగాహనతో భట్టి సూచనలు చేస్తారనుకుంటే అవేమి కనిపించలేదని మంత్రి విమర్శించారు. రాష్ట్రమంతా బాగుండలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
అందుకే మేనిఫెస్టోలో లేని ఎన్నో పథకాలను అమలు చేస్తున్నట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు. తెలంగాణ గ్రామాల్లో ఉన్న మౌలిక సదుపాయాలు బీజేపీ- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా? అంటూ ప్రశ్నించారు. గ్రామాల్లో అభివృద్ధిపై కాంగ్రెస్ – టీఆర్ఎస్ పాలనలో మార్పులపై భట్టి నియోజకవర్గం మధిరకు వెళ్దామంటూ హరీష్ రావు సవాల్ చేశారు. దీనికి ఒప్పుకుంటే వెళ్తామంటూ సూచించారు.