జై తెలంగాణ ఎక్కడ?.. సీఎం రేవంత్‌పై హరీష్‌రావు ఫైర్‌

గతంలో సమైక్య పాలనలో జై తెలంగాణ మాటను నిషేధించారు..మళ్లీ ఇప్పుడు రేవంత్‌ పాలనలో తెలంగాణ పదం మాయమవుతుందని మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు.

Update: 2024-06-03 10:42 GMT

జై తెలంగాణ ఎక్కడ?.. సీఎం రేవంత్‌పై హరీష్‌రావు ఫైర్‌

Harish Rao: సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీష్‌రావు ఫైరయ్యారు. గతంలో సమైక్య పాలనలో జై తెలంగాణ మాటను నిషేధించారు..మళ్లీ ఇప్పుడు రేవంత్‌ పాలనలో తెలంగాణ పదం మాయమవుతుందని మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. రాష్ట్ర అవతరణ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పత్రికా ప్రకటనల్లో ఎక్కడా జై తెలంగాణ లేదన్నారు.

బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన ప్రకటనల్లో పై భాగంలో జై తెలంగాణ, జైజై తెలంగాణ అని ఖచ్చితంగా ఉండేదని తెలిపారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేయాలని ఆంధ్రా నాయకులు అంటున్నారని..కానీ తెలంగాణకు కేసీఆర్ శ్రీరామరక్ష అని అన్నారు. ఏనాడు జై తెలంగాణ అనని రేవంత్‌రెడ్డి సీఎం కావొచ్చు కానీ ఎన్నటికి ఉద్యమకారులు కాలేడన్నారు. సిద్ధిపేటలో బీఆర్ఎస్‌ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలు నిర్వహించారు.

Tags:    

Similar News