Harish Rao: ఎన్నికల్లో గ్యారంటీల గారడీ... ఇప్పుడు అంకెల గారడీ
Harish Rao: తెలంగాణ బడ్జెట్‌లో గ్యారంటీల ప్రస్తావన లేదన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు.
Harish Rao: తెలంగాణ బడ్జెట్‌లో గ్యారంటీల ప్రస్తావన లేదన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. అన్ని వర్గాలను నిరాశ పరిచిందని విమర్శించారు. ఎన్నికల్లో గ్యారంటీల గారడీ ప్రస్తుతం అంకెల గారడీ అని ఆరోపించారు. ఆటో కార్మికులు, మహిళలు, నిరుద్యోగుల ప్రస్తావన బడ్జెట్‌లో లేదన్నారు. గత ప్రభుత్వ ఘనతను తమ ఘనతగా చెప్పుకుంటున్నారని ఆక్షేపించారు.
బడ్జెట్‌లో ఆసరా పెన్షన్‌ల ప్రస్తావనే తీసుకురాలేదని అన్నారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారని, కానీ బడ్జెట్‌లో మాత్రం ఆ ఊసే ఎత్తలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారుకు పేదల ప్రభుత్వం అని చెప్పుకునే అర్హత లేదని అన్నారు.