Kishan Reddy: హర్ ఘర్ తిరంగా... మనందరి బాధ్యత
Kishan Reddy: ప్రతి ఒక్కరూ ఈ పండగలో ఉత్సాహంగా పాల్గొనాలి
Kishan Reddy: ప్రధాని మోడీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కోరారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా.. హైదరాబాద్ లోని తమ నివాసంలో కిషన్ రెడ్డి దంపతులు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ జెండా పండగలో ప్రతిఒక్కరూ ఉత్సాహంగా పాల్గొనాలని.. జాతీయ సమైక్యతను కాపాడటం మనందరి బాధ్యత అన్నారు. స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి సంఘాలు తిరంగా ర్యాలీలు నిర్వహించి.. ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలన్నారు. ఆగస్టు 9న దేశవ్యాప్తంగా ప్రారంభమైన హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఆగస్టు 15 వరకు కొనసాగనుంది.