HANS Hyderabad Marathon: పరుగుతో జీవితానికి భరోసా పేరుతో హైదరాబాద్ మహానగరంలో హాన్స్ ఇండియా మారథాన్ పరుగుపందెం

HANS Hyderabad Marathon: గచ్చిబౌలి స్టేడియం నుంచి 10కి.మీ. 5 కి.మీ పరుగు పందెం

Update: 2023-09-10 03:16 GMT

HANS Hyderabad Marathon: హాన్స్ ఇండియా మారథాన్

HANS Hyderabad Marathon: ప్రపంచ ఆత్మహత్యల దినోత్సవ సందర్భంగా పరుగుతో జీవితానికి భరోసా పేరుతో హైదరాబాద్ మహానగరంలో హాన్స్ ఇండియా మారథాన్ పరుగుపందెం నిర్వహించింది. హుస్సేన్ సాగర్ సమీపంలోని పీవీ నరసింహారావు మార్గంలో పీపుల్స్ ప్లాజా ఆవరణలో యువతీయువకుల కోలాహలం చోటుచేసుకుంది. మారథాన్ ప్రారంభానికి ముందు జుంబాడ్యాన్స్‌ ఉత్సాహభరితంగా సాగింది. తెలంగాణ కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ రమేష్, పోలీస్ అడిషనల్ కమిషనర్ మారథాన్ పరుగుపందెంను జెండా ఊపి ప్రారంభించారు. ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్ ఈవెంట్లలో1500 మంది రన్నర్లు పాల్గొన్నారు.

హుస్సేన్ సాగర్ సమీపంలో ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్ పరుగు పందెం ప్రారంభం కాగా... గచ్చిబౌలి స్టేడియం వేదికగా పది కిలోమీటర్ల పరుగు పందెం, 5 కిలోమీటర్ల పరుగు పందెం కోలాహలంగా సాగింది. ఈ పరుగు పందెంలో 5వేల మంది రన్నర్లు భాగస్వామ్యమయ్యారు.

గత మూడేళ్లలో వివిధ వయసుల్లో ఉన్న 13వేల మంది ఆత్మహత్యలకు పాల్పడి.. ఆ కుటుంబాల్లో శోకాన్ని మిగిల్చారు. క్షణికావేశంతో ప్రాణాలను తీసుకోవడం సమస్యకు పరిష్కారంకాదని, మానసిక పరివర్తనలో మార్పుతో భవిష్యత్తును ఆశాజనకంగా తీర్చి దిద్దుకోవచ్చనే దివ్యసందేశంతో జీవితానికి పరుగుతో మార్పు చేసుకోవచ్చనే కాన్సెప్ట్‌తో ఈ పరుగు పందెం నిర్వహిస్తున్నామని మారథాన్ నిర్వాహకులు తెలిపారు.

మానసిక పరివర్తనలో మార్పు... ఉన్నతమైన జీవితానికి మలుపు అనే నినాదంతో ఈ పరుగు పందెం వయసుతో సంబంధంలేకుండా... అన్ని వర్గాలవారిలో మార్పు తీసుకొస్తుందనే విశ్వాసం వ్యక్తంచేశారు. విద్యార్థులు, విద్యావంతులు, మేధావులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు మారథాన్‌లో పాలుపంచుకున్నారు.

హైదరాబాద్ నగర వాసులతోపాటు, పరిసరాల్లోని వాకర్లు, సిద్దిపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన యువతీ యువకులు, ఉద్యోగులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. పొరుగు రాష్ట్రాలకు చెందిన మారథాన్ వీరులు భాగస్వామ్యం కావడం విశేషం.

హుస్సేన్ సాగర్ పీపుల్స్ ప్లాజా, గచ్చిబౌలి స్టేడియం‌లనుంచి ప్రారంభమైన మారథాన్ పరుగు పందేలు గచ్చి బౌలిస్టేడియంలోనే ముగిసే విధంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేపట్టారు. ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్, 10 కిలోమీటర్ల పరుగు పందెం, 5 కిలోమీటర్ల పరుగు పందెంలో ఒక్కో ఈవెంట్లల్లో విజేతలకుగా నిలిచిన తొలి ముగ్గురికి బహుమతులను ప్రధానం చేశారు. అన్ని విభాగాల్లో నిలిచిన విజేతలను తెలంగాణ డిజిపి అంజనీకుమార్ ప్రత్యేకంగా అభినందించారు. 24 మందిని ఎంపికచేసి బహుమతులను ప్రధానం చేశారు.

Tags:    

Similar News