కొత్త సచివాలయం దగ్గర గందరగోళం.. ఎమ్మెల్యే గువ్వలను అడ్డుకున్న భద్రతా సిబ్బంది

Guvvala Balaraju: సచివాలయం ద్వారాల వద్ద గందరగోళం ఏర్పడింది.

Update: 2023-05-01 07:30 GMT

కొత్త సచివాలయం దగ్గర గందరగోళం.. ఎమ్మెల్యే గువ్వలను అడ్డుకున్న భద్రతా సిబ్బంది

Guvvala Balaraju: సచివాలయం ద్వారాల వద్ద గందరగోళం ఏర్పడింది. దీంతో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే లు ఏ గేట్ నుంచి వెళ్లాలంటూ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు భద్రతాధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటగా మెయిన్ గేట్ దగ్గరకు వెళితే సౌత్ గేట్ కి వెళ్ళాలన్నారు. అక్కడ నుంచి నార్త్ ఈస్ట్ గేట్ కి వెళ్లాలనడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిజానికి కొత్త సచివాలయానికి 4 ఎంట్రీలున్నాయి. వాటిలో వాయవ్య ఎంట్రీని అత్యవసర అవసరాల కోసం మాత్రమే వాడుతారు. మిగతా 3 ఎంట్రీల్లో తూర్పు ఎంట్రీ నుంచి సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ, డీజీపీ, విదేశీ ప్రతినిధులు, ఆహ్వానితులు సచివాలయంలోకి వస్తారు. ఈశాన్య ఎంట్రీ నుంచి కార్యదర్శులు, అధికారులు, సిబ్బంది వస్తారు. సందర్శకులు ఆగ్నేయ ద్వారం నుంచి మాత్రమే సచివాలయంలోకి వెళ్లేందుకు వీలుంది. ఇలా ఒక్కో ఎంట్రీకీ ఒక్కో రూల్ ఉండటంతో.. ఏ ఎంట్రీ నుంచి వెళ్లాలనే అంశంపై కొంత గందరగోళం ఏర్పడుతోంది.

Tags:    

Similar News