Gudem Mahipal Reddy: రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జోడు గుర్రాల వలె పరిగేడుతున్నాయి
Gudem Mahipal Reddy: అందరూ బీఆర్ఎస్ గెలుపుకు కృషి చేయాలి
Gudem Mahipal Reddy: సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు పట్టణ పరిధిలోని జీఎంఆర్ కన్వెన్షన్ లో బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాను రేపు నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. మన రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు మాత్రమే అయింది.. కానీ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జోడు గుర్రాల వలె పరిగేడుతున్నాయన్నారు. ఈ క్రెడిట్ అంతా మన ముఖ్యమంత్రి కేసీఆర్ దే అని కొనియాడారు. ఓటు అడిగే హక్కు ఒక్క బీఆర్ఎస్ నాయకునికి, కార్యకర్తలకే ఉందని.. అందరూ సమిష్టి కృషితో బిఆర్ఎస్ గెలుపుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.