Hyderabad: అశోక్‌నగర్‌లో యువతి ఆత్మహత్య.. ప్రభుత్వమే కారణమంటూ అర్థరాత్రి విద్యార్థుల ఆందోళన..

Group 2 Aspirant: హైదరాబాద్ చిక్కడపల్లిలో యువతి ఆత్మహత్య కలకలం రేపింది.

Update: 2023-10-14 02:00 GMT

Hyderabad: అశోక్‌నగర్‌లో యువతి ఆత్మహత్య.. ప్రభుత్వమే కారణమంటూ అర్థరాత్రి విద్యార్థుల ఆందోళన..

Group 2 Aspirant: హైదరాబాద్ చిక్కడపల్లిలో యువతి ఆత్మహత్య కలకలం రేపింది. హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు వరంగల్ జిల్లాకు చెందిన ప్రవళికగా గుర్తించారు. నా వల్ల ఎప్పుడూ బాధ పడుతూనే ఉన్నారు. నేను నష్టజాతకురాలిని.. అమ్మా..నాన్నా.. నన్ను క్షమించండి అంటూ సూసైడ్ లెటర్ రాసి చనిపోయింది ప్రవళిక.

అశోక్‌నగర్‌లో యువతి ఆత్మహత్యతో భారీగా విద్యార్థులు హాస్టల్‌కు చేరుకున్నారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతోన్న ప్రవళిక సూసైడ్ చేసుకోవడంతో.. రోడ్డుపై ఆందోళన చేపట్టారు. పోలీసులు మృతదేహాన్ని తరలించకుండా అడ్డుపడ్డారు. ఆందోళనలో పాల్గొన్న విద్యార్థి సంఘాలు గ్రూప్ 2 రద్దు కారణంగానే యువతి బలవన్మరణానికి పాల్పడిందని ఆరోపించాయి. పెద్ద ఎత్తున విద్యార్థులు రావడంతో అశోక్‌నగర్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ఇక విద్యార్థుల ఆందోళనలకు విద్యార్థి సంఘాలతో పాటు రాజకీయ నేతలు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్, బీజేపీ లక్ష్మణ్, NSUI నేత అనిల్ కుమార్ యాదవ్ విద్యార్థులతో పాటు ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రవళికది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్య అన్నారు లక్ష్మణ్‌. విద్యార్థుల జీవితాలు ఆగమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

అశోక్‌నగర్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు డాక్టర్ లక్ష్మణ్‌ను, అనిల్ కుమార్ యాదవ్‌ను అరెస్ట్ చేసి తరలించారు. ఆ తర్వాత చుట్టుపక్కల ఉండే హాస్టల్ విద్యార్థులు ప్రవళిక మృతదేహాన్ని తరలించకుండా పోలీసులను అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి వుయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. విద్యార్థులను చెదరగొట్టి ప్రవళిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగిస్తామన్నారు. 

Tags:    

Similar News