తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని ఇప్పటికే పలువురు ట్విట్టర్ వేదికగా ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కవిత ట్విటర్ ద్వారా కోరుకున్నారు. ఈ క్రమంలోనే గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కూడా ఆయన త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. కరోనా నుంచి హరీష్‌రావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని ఆమె ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.
ఈ నెల 7వ తేది నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అసెంబ్లీలో కరోనా టెస్టులు నిర్వహించారు. కాగా ఈ టెస్టుల్లో మంత్రి హరీశ్ రావుకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో మంత్రి హరీశ్ రావు ఈ విధంగా ట్వీట్ చేసారు. నాకు కరోనా పాజిటివ్ వచ్చింది, నేను ఆరోగ్యంగానే ఉన్నాను. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గత కొద్దిరోజులుగా నన్ను కలిసిన వారు కరోనా టెస్టులు చేయించుకోండి అని తెలిపారు. ప్రస్తుతం ఆయన హోంక్వారంటైన్‌లో ఉన్నారు. వైద్యుల సూచనల మేరకు వారు మందులు వాడుతున్నారు.
ఇక పోతే మంత్రి కేటీఆర్ హరీశ్ రావు కోలుకోవాలంటూ గెట్ వెల్ సూన్ బావ అంటూ ట్వీట్ చేశారు. ఇతరుల కంటే మీరు త్వరగా కోలుకుంటారనే నమ్మకం ఉందని కేటీఆర్ అన్నారు. మాజీ ఎంపీ కవిత కూడా హరీష్ రావు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. 'బావా .. మా ప్రార్థనలన్నీ మీ కోసమే. మీ సంకల్ప బలంతో కరోనా వైరస్‌ను ఓడించాలి' అని ట్వీట్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు గారు త్వరగా కోలుకొవాలని ఆకాంక్షిస్తున్నాను.
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) September 6, 2020
I wish speedy recovery of Telangana State Finance Minister Shri T. Harish Rao garu @trsharish @PIBHyderabad @IPRTelangana @DDYadagiri @airnews_hyd