Tamilisai Soundararajan: వైద్యం ఖరీదు కాకూడదు

* రాజ్‌భవన్‌లో వైద్యపరికరాల స్టార్టప్ నిర్వాహకులకు సత్కారం

Update: 2022-12-16 01:14 GMT

వైద్యం ఖరీదు కాకూడదు

Governor Tamilisai Soundararajan: వైద్యం ఖరీదు కాకూడదని తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆకాంక్షించారు. హైదరాబాద్ రాజ్ భవన్‌ లో మెడికల్ డివైజ్ స్టార్టప్ నిర్వాహకులతో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై విలువైన సూచనలు చేశారు. వైద్యఖర్చులు పెరిగిపోతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. వైద్య చికిత్సలో నాణ్యమైన ఉపకరణలను తక్కువ ఖర్చుకే అందించేందుకు ఉత్పాదకులు ముందుకురావాలని ఆమె కోరారు. పొరుగు దేశాలతో పోల్చుకుంటే తక్కువఖర్చుకు వైద్యఉపకరణాల ఉత్పత్తిదారులకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

గుండెజబ్బుల నివారణలో ఆధునిక వైద్యచికిత్స ఉపకరణాలను అందుబాటులోకి తీసుకొస్తే వైద్యఖర్చును గణనీయంగా తగ్గించవచ్చని స్టార్టప్ నిర్వాహకులు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యఖర్చు తగ్గించి, నాణ్యమైన వైద్యసేవలు అందించవచ్చే అభిప్రాయం వ్యక్తంచేశారు.

Tags:    

Similar News