Hydra: హైడ్రా కూల్చివేతలపై మరో కీలక నిర్ణయం..బిల్డర్ల నుంచి బాధితులకు పరిహారం
Hydra: హైడ్రా కూల్చివేతలపై మరో కీలక నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. బాధితులకు పరిహారం చెల్లించే విషయంలో ప్రభుత్వం బిల్డర్ల నుంచి డబ్బులు రికవరీ చేసి బాధితులకు ఇప్పించాలని సర్కార్ భావిస్తోందని సమాచారం. కూల్చివేతల విషయంలో ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయంపై వైపు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

గ్రేటర్ హైదరాబాద్ లోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, నాలాలు కబ్జా చేసి అక్రమంగా నిర్మించిన కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. గత రెండు మూడు నెలల వ్యవధిలో వందలాది ఇళ్లను హైడ్రా అధికారులు కూల్చివేశారు. కాగా ఈ హైడ్రా కూల్చివేతలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పేదల ఇళ్లను మాత్రమే నేలమట్టం చేస్తున్నారని..రూపాయి రూపాయి కూడబెట్టుకుని కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చివేయడం సరైంది కాదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. బిల్డర్లు, బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసిన మోసానికి పేదలు నష్టపోతున్నారని..చెరువుల బఫర్, ఎఫ్టీఎల్ జోన్ అనేది తెలియకుండానే పేదలు బిల్డర్ల వద్ద నుంచి ఆ ఇళ్లను కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే హైడ్రా కూల్చివేతలపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బిల్డర్ల మోసానికి బలైపోయే పేదలను ఆదుకోవాలని హైడ్రా సూత్రపాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇళ్లు కోల్పోయిన పేదలకు బిల్డర్ల నుంచి పరిహారం ఇప్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగానాథ్ కూడా ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వివరించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని నేరుగా సీఎం రేవంత్ రెడ్డితో చర్చించాలని భట్టి సూచించారట. ఈ మేరకు అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై త్వరలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.