Telangana: రాష్ట్రంలోని అగ్ర సౌర కంపెనీలకు ప్రభుత్వాల సత్కారం

* సన్‌టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లివిటెడ్‌కు దక్కిన అవార్డు * సంతోషం వ్యక్తం చేసిన మేనేజింగ్ డైరెక్టర్ భవాని సురేష్

Update: 2021-08-27 11:18 GMT

సోలార్ సిస్టం (ఫైల్ ఫోటో)

Solar Companies: భారత మంత్రిత్వ శాఖ నూతన, పునరుత్పాదక శక్తి, తెలంగాణ రాష్ట్ర పునరుద్దరణ శక్తి అభివృద్ధి సంస్థతో కలిసి రాష్ట్రంలోని అగ్ర సౌర కంపెనీలను సత్కరించింది. కాగా రాష్ట్రంలోని సన్‌టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ ఆజాది కా అమృత్ మహోత్సవ్ 2021 అవార్డు గెలుచుకుంది. ఈ సందర్భంగా సన్‌టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ భవాని సురేష్ సంతోషం వ్యక్తం చేశారు. అమ్మకాల మద్దతుతో పాటు కస్టమర్లతో మంచి సంబంధం కలిగి ఉండటం వల్లే ఈ అవార్డు సాధించగలిగామని ఆయన తెలిపారు.

కాగా ఈ సన్‌టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2008లో స్థాపించబడింది. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుంది. ఈ సంస్థ సోలార్ పవర్ సిస్టం, సోలార్ వాటర్ సీటింగ్ సిస్టం, సోలార్ స్ట్రీట్ లైటింగ్ సిస్టం, సోలార్ సెక్యూరిటీ ఫెన్సింగ్ వంటి ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఈ ఉత్పత్తులతో దాదాపు 3 వందల రోజులు సూర్యరశ్మితో సౌరశక్తిని ఉపయోగించుకొని ఎలక్ట్రిసిటీ వాడకాన్ని ఆదా చేస్తుంది.

Tags:    

Similar News