నిరుద్యోగులకు కేటీఆర్‌ శుభవార్త.. త్వరలోనే నిరుద్యోగ భృతి

Update: 2021-01-28 12:20 GMT

నిరుద్యోగులకు కేటీఆర్‌ శుభవార్త.. త్వరలోనే నిరుద్యోగ భృతి

రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ శుభవార్త చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలోనే నిరుద్యోగ భృతి ప్రకటించవచ్చు అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో రాష్ట్ర విద్యుత్‌ కార్మిక సంఘం సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశానికి విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. సీఎం కేసీఆర్‌ త్వరలోనే నిరుద్యోగ భృతి ప్రకటించవచ్చన్నారు. ఇప్పటికే లక్ష 31 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లుగా తెలిపారు. త్వరలోనే మరో 50 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ బిడ్డలను రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది అని గర్వంగా చెబుతున్నా. కొత్త కొత్త ఆలోచనలతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇష్టానుసారంగా మాట్లాడుతున్న ప్రతిపక్ష నేతలు ఇవన్నీ గమనించాలి. కేసీఆర్‌ తెలంగాణ తేవడం వల్లే టీపీసీసీ, టీబీజేపీ అధ్యక్ష పదవులు ఏర్పడ్డాయి. ప్రభుత్వంపై ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు తిప్పికొట్టాలి. ఉద్యోగులకు అక్కడక్కడా ఉన్న చిన్నపాటి సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తాం అని కేటీఆర్‌ చెప్పారు.

Tags:    

Similar News