Telangana: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త

Telangana: 3,334 నియామకాలకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్

Update: 2022-04-14 04:00 GMT

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త 

Telangana: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తొలి విడత 30వేల 453 ఉద్యోగ ఖాళీల భర్తీకి అనుమతించిన ఆర్థిక శాఖ తాజాగా మరో 3,334 ఉద్యోగ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధఇంచిన జీవోలను జారీ చేసింది. శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ 80,039 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తొలి విడతగా 30,453 ఖాళీల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ జీవోలు జారీ చేసింది. ఈ నియామక ప్రక్రియకు వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఫైర్ సర్వీసు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, అటవీ శాఖల్లోని 3,334 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. మిగతా శాఖల్లోని ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియకు ఆర్థిక శాఖ వేగంగా సన్నాహాలు చేస్తోంది.

యూనిఫాం సర్వీసు ఉద్యోగుల గరిష్ట వయోపరిమితిని రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లకు పెంచింది. మంగళవారం కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయంతో సంబంధిత శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ సమీక్ష జరిపారు. వయో పరిమితి పెంపు అంశంపై చర్చించారు. పోలీసు, ఎస్పీఎఫ్, ఎక్సైజ్, అగ్నిమాపక శాఖ, జైళ్లు, రవాణా, అటవీ ఉద్యోగాలకు గరిష్ట వయస్సును మూడేళ్లపాటు పొడిగించారు. వయో పరిమితి రెండేళ్లపాటు అమలులో ఉంటుంది. ఇందుకోసం సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Tags:    

Similar News