Telangana: మద్యం ప్రియులకు శుభవార్త.. తగ్గనున్న బీర్ల ధరలు
Telangana: తెలంగాణలోని మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పనుంది.
Telangana: తెలంగాణలోని మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పనుంది. ప్రస్తుతం ఉన్న 150 రూపాయల బీర్ ధరను 140 రూపాయలకు విక్రయనించనుంది. కరోన మరియు లాక్ డౌన్ లా కారణంగా బీర్ల అమ్మకాలు తగ్గడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దానికి సంబందించిన ఉత్తర్వులు కూడా సోమవారం విడుదల చేయనుంది. గత ఏడాది సెస్ పేరుతో 120 రూపాయలు ఉన్న బీర్ ధరను ౩౦ రూపాయలు పెంచిన ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 10 రూపాయలను తగ్గించనుంది. మారిన ఈ ధరలు రేపటి నుండి అమలు కానున్నాయి.
ప్రస్తుతం ఉన్న స్టాక్ పూర్తి అయిన తర్వాత కొత్త ధరలతో బీర్లను అమ్మనున్నారు. ఇప్పటికే కరోన మొదటి వేవ్ లో కొన్ని రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు మద్యం అమ్మకాలపై సెస్ ని తగ్గించిన తెలంగాణా ప్రభుత్వం మాత్రం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ లో బీర్ల అమ్మకాలు తగ్గడంతో సంగారెడ్డి లోని లిక్కర్ డిస్టిలరీ లో కూడా బీర్ల ఉత్పత్తి ఆపివేసి కొత్త ధరలతో బీర్లను ఇకపై తయారు చేయనున్నారు.మద్యం ప్రియులకు శుభవార్త.. తగ్గనున్న బీర్ల ధరలు