Bhadrachalam: గోదావరి మహోగ్రరూపం.. కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

Bhadrachalam: గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. వరదలతో ఉరకలేస్తున్న గోదావరి భద్రాచలం దగ్గర ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

Update: 2024-07-27 10:36 GMT

Bhadrachalam: గోదావరి మహోగ్రరూపం.. కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

Bhadrachalam: గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. వరదలతో ఉరకలేస్తున్న గోదావరి భద్రాచలం దగ్గర ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గంటగంటకూ పెరుగుతున్న ఉధృతితో భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం 52.7 అడుగులకు చేరింది. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయగా.. నదిలో ప్రవాహం కొనసాగుతూనే ఉంది. దీంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరదల ప్రభావంతో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రెండు ప్రధాన రహదారులపై గోదావరి వరదనీరు చేరింది.

మరోవైపు గోదారి మహోగ్రరూపంతో పరివాహక ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఇప్పటికే పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరదలతో జనం అల్లాడుతున్నారు. మూటాముళ్లె సర్దుకుని ప్రాణాలు కాపాడుకునేందుకు సాయం కోసం చూస్తున్నారు. వరద రోజురోజుకూ పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 9 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి.. లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలిస్తున్నారు. 

Tags:    

Similar News