GHMC కొత్త కార్పోరేటర్లు వచ్చినప్పటికీ పాత బాడీతోనే చివరి సమావేశం

* కొత్త కార్పోరేటర్లు వచ్చినప్పటికీ పాత బాడీతోనే చివరి సమావేశం * ప్రతీ 3 నెలలకు ఒకసారి కౌన్సిల్ సమావేశాలు * సమావేశంలో స్టాండింగ్ కమిటీ నిర్ణయాలపై చర్చ

Update: 2021-01-25 14:44 GMT

GHMC (file image)

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కు ఈ మద్య కాలంలోనే ఎన్నికలు జరిగాయి. ఎన్నకలు జరిగి కొత్త కార్పోరేటర్లు వచ్చినప్పటికినీ.. వారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. దీనితో పాత బాడినే ఇంకా కొనసాగుతుంది. పాత బాడీతో జరిగే చివరి కార్పోరేషన్ సమావేశం పై ఓ స్టోరి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత జరిగిన మొదటి GHMC ఎన్నికల్లో టీఆర్ఎస్ మేయర్ పీఠం దక్కించుకుంది. నూతన రాష్ట్రంలో అతి పెద్ద కార్పోరేషన్ గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గా బొంతు రామ్మోహన్ ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ప్రతి మూడు నెలల కు ఒకసారి కౌన్సిల్ సమావేశం జరుగుతూ వస్తుంది. ఈ సమావేశాల్లో స్టాండింగ్ కమిటిలో తీసుకున్న నిర్ణయాలను చర్చిస్తారు. ఇప్పటి వరకు పదిహేను కౌన్సిల్ సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల్లో హైదరాబాద్ నగరానికి కావలసిన అబివృద్ది కార్యక్రమాలపై చర్చించారు. ఈ నేపద్యంలోనే మూడు నెలల ముందు గానే ఎన్నికలు జరగాయి

అయినా పాత కార్పోరేట్ లతోనే ఈసారి 16 వ ప్రత్యేక సమావేశం జరగబోతుంది. ఈ నెల 27 బుధవారం ఉదయం పదిన్నరకు కౌన్సిల్ హాల్ లో ఈ సమావేశం జరుగుతుంది. జిహెచ్ఎంసి 2021-2022 సంవత్సరానికి బడ్జెట్ అంచనాలు మరియు జిహెచ్ఎంసి యొక్క 2020-2021 సంవత్సరానికి సవరించిన బడ్జెట్ అంచనాలు కమిషనర్ తయారు చేసిన జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ ఆమోదించిన విషయాలు చర్చించ బోతున్నారు. స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసిన విధంగా 2021-2022 బడ్జెట్ అంచనాలు ఎలా ఉండబోతున్నాయి అనేది సస్పెన్స్ గా ఉంది.గతంలో జరిగిన పదిహేను సమావేశాల కంటే ఈ సారి జరిగే సమావేశం చాలా ప్రత్యేకమైనది. ఈ సమావేశంలో కొత్తగా గెలిచిన వారు, ఓడిపోయిన కార్పోరేటర్లు ఉండబోతున్నారు.

Tags:    

Similar News