Hyderabad: కరోనా కట్టడికి జీహెచ్ఎంసీ కీలక నిర్ణయాలు
Hyderabad: గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయాలు తీసుకుంది.
Hyderabad: గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయాలు తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి అని, ప్రజలెవరూ గుమిగూడి ఉండరాదని సూచించింది. మాస్క్ లేకపోతే జీహెచ్‌ఎంసీ ఉద్యోగులైనా సరే ఆఫీస్‌లకు అనుమతించమని, అలాగే ఉద్యోగులు ఆఫీస్ లోపలికి వచ్చినప్పుడు, బయటకు వెళ్లేటప్పుడు చేతులు శానిటైజ్ చేసుకోవాలని తెలిపింది. 6 అడుగుల భౌతికదూరం పాటించాలని, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే ఫైన్ కట్టాల్సి ఉంటుందని హెచ్చరించింది జీహెచ్‌ఎంసీ.