Praja Palana: రోడ్డుపై తేలిన 6 గ్యారెంటీల అప్లికేషన్లు.. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారి సస్పెండ్..
Praja Palana: ర్యాడిడో వెహికల్‌పై తీసుకెళ్లిన హయత్‌నగర్ మండలానికి చెందిన దరఖాస్తులు
Praja Palana: గ్యారెంటీ పథకాల కోసం సమర్పించిన దరఖాస్తులు రోడ్డుపాలయ్యాయి. పథకాల లబ్దిదారుల కోసం స్వీకరించిన దరఖాస్తులు ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు ఓ ఇంజినీరింగ్ విద్యార్థికి ఇచ్చారు అధికారులు. ప్రజాపాలన దరఖాస్తులు కనీస భద్రత లేకుండా బయటి వ్యక్తులకు అప్పగించారు కుత్బుల్లాపూర్ అధికారులు.
మరోవైపు దరఖాస్తులను తీసుకెళ్తుండగా.. అభయహస్తం పథకానికి చెందిన దరఖాస్తులు బాలానగర్ ఫ్లై ఓవర్ పై కుత్బుల్లాపూర్‌కు చెందిన అప్లికేషన్లు రోడ్డుపై పడిపోయాయి. ర్యాపిడో వెహికల్ పై తీసుకెళ్తండగా పడిపోయాయి. పడిపోయిన అప్లికేషన్లు హయత్‌నగర్ మండలానికి చెందినవిగా గుర్తించారు. కాగా.. ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డుపై పడిపోవడంతో.. హయత్ నగర్ సర్కిల్ పరిధిలో వాల్యూయేషన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఎస్ మహేందర్‌ను జీహెచ్ఎంసీ కమిషనర్ సస్పెండ్ చేశారు.