ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గంజాయి కలకలం
* ఆదర్శనగర్‌లో 2.5 కేజీల గంజాయి స్వాధీనం * గంజాయి అమ్ముతున్నారన్న సమాచారంతో తనిఖీలు * ఆరుగురు యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గంజాయి కలకలం రేగుతోంది. ఆదర్శనగర్‌లో రెండున్నర కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గంజాయి అమ్ముతున్నారన్న సమాచారంతో తనిఖీలు చేపట్టిన పోలీసులు ఆరుగురు యువకులను అరెస్ట్ చేశారు. జగిత్యాల జిల్లా తక్కళ్లపల్లిలో గంజాయి సేవిస్తున్న యువకులకు దేహశుద్ధి చేశారు స్థానికులు. సిగరెట్లలో గంజాయి పెట్టుకుని తాగుతున్న ముగ్గురు యువకులను చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. గతంలో కరీంనగర్‌లో నిర్వహించిన వాహన తనిఖీల్లో ఈ ముగ్గురు యువకులు గంజాయితో పట్టుబడినట్టు పోలీసులు తెలిపారు.