Gandhi Hospital: అత్యాచార ఘటన.. నేరాన్ని అంగీకరించిన సెక్యూరిటీ గార్డు
Gandhi Hospital: గాంధీ ఆస్పత్రి అత్యాచార ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు.
Gandhi Hospital: గాంధీ ఆస్పత్రి అత్యాచార ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. ఆరోపణల తర్వాత కనిపించకుండా పోయిన సెక్యూరిటీ గార్డు విజయ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా బాధితురాలిపై అత్యాచారం చేసినట్లు ఒప్పకున్నాడని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన రోజు విజయ్‌తో కలిసి బాధితురాలు వెళ్లినట్లు సీసీ టీవీ ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. బాధితురాలు అతనితో ఇష్టపూర్వకంగా వెళ్లిందా? లేదా ? అనే కోణంలో విచారిస్తున్నారు. మరోవైపు ఘటన జరిగినప్పటి నుంచి కనిపించకుండా పోయిన బాధితురాలి సోదరిని కూడా పోలీస్ బృందం గుర్తించి స్టేషన్‌కు తీసుకొస్తున్నట్లు సమాచారం.
మహబూబ్‌నగర్ నుంచి ఈ నెల 5న కిడ్నీల వ్యాధిని నయం చేసుకునేందుకు గాంధీ ఆస్పత్రికి వచ్చిన ఓ రోగికి అతడి భార్య, మరదలు సాయంగా వచ్చిన అంశం ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మహబూబ్‌నగర్‌కు వెళ్లి కేసుకు సంబంధించిన మరి కొన్ని విషయాలు తెలుసుకున్నారు. ఈ కేసులో బాధితురాలిని మహిళా పోలీసులు రహస్య ప్రాంతంలో విచారించారు. ఆమె స్టేట్‌మెంట్‌ను మరో మారు రికార్డు చేశారు. అక్కాచెల్లెళ్లకు కల్లు తాగే అలవాటు ఉందని వారి బంధువులు, కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. నగరంలో కల్లు ఎక్కడ దొరుకుతుందో తెలియకపోవడానికి తోడు అప్పటికే ఐదు రోజుల పాటు కల్లు తాగకపోవడంతో మతిస్థిమితం తప్పి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు.