టీఆర్ఎస్ మేయర్ అభ్యర్ధిగా గద్వాల విజయలక్ష్మి?
* కాసేపట్లో తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ కార్పొరేటర్లతో.. * కేకే, కేటీఆర్, తలసాని సమావేశం * టీఆర్ఎస్ మేయర్ అభ్యర్ధిగా గద్వాల విజయలక్ష్మి?
కాసేపట్లో తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ కార్పొరేటర్లతో కేకే, కేటీఆర్, తలసాని సమావేశంకానున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాన్ని కేటీఆర్ వివరించనున్నారు. ఇప్పటికే తెలంగాణ భవన్‌కు పలువురు కార్పొరేటర్లు చేరుకున్నారు. టీఆర్ఎస్ సీల్డ్ కవర్‌లో అభ్యర్థుల పేర్లు ఉంచింది. వాటిని ఓపెన్ చేసే వరకు గులాబీ అభ్యర్థి ఎవరనేది తేలే అవకాశాల్లేవు.
టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిగా గత కొద్దిరోజుల నుంచి పలువురు కార్పొరేటర్ల పేర్లు ప్రచారం జరిగినా బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మినే మేయర్ అభ్యర్ధిగా ప్రకటించినట్టు ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు భరత్ నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, విజయారెడ్డి, మన్నె కవితా రెడ్డి, చర్లపల్లి కార్పోరేటర్ బొంతు శ్రీదేవి, అల్వాల్ కార్పోరేటర్ చింతల విజయశాంతి రెడ్డి కూడా మేయర్ కోసం పోటీ పడుతున్నారు. అయితే అధిష్టానం ఎవరిని ఫైనల్ చేస్తుందని కాసేపట్లో తేలనుంది. అయితే, సామాజిక సమీకరణాల ఆధారంగా.. కేకే కూతురు గద్వాల విజయలక్ష్మిని మేయర్‌గా, మోతె శ్రీలతా రెడ్డిని డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది.