ఫారన్ మద్యంపై మోజు పెంచుకుంటున్న మందుబాబులు
*హైదరాబాద్‌లో కుప్పలు తెప్పలుగా వెలుస్తున్న ఇంపోర్టెడ్ లిక్కర్ మాల్స్ *హంగూ ఆర్భాటాలతో సగం కిక్కు ఎక్కిస్తున్న వైన్ మాల్స్ *కాస్లీ ఎంతైనా.. డోన్ట్ కేర్ అంటున్న మద్యం ప్రియులు
మందుబాబులకు ఎంత తాగితే అంత కిక్కు.. కొందరికి మాత్రం హై బ్రాండ్ తాగితేనే మజా.. అది కూడా ఫారన్ సరకు అయి ఉండాలి.. ఇప్పుడిదే క్రేజ్ హైదరాబాద్‌లో ఎక్కువైపోయింది. యువకులు విదేశీ మద్యంపై మోజు పెంచుకుంటున్నారు. కాస్లీ ఎంతైనా సరై ఫారన్ బాటిల్ ఎత్తాల్సిందే అంటున్నారు. మందుబాబులు సైతం కొత్త టేస్ట్ కోరుకుంటున్నారు. ఫారన్ మందుకే మొగ్గుచూపుతున్నారు. నగరంలో కుప్పలు తెప్పలుగా వెలసిన ఇంపోర్టెడ్ లిక్కర్ మాల్స్‌పై హెచ్‌ఎంటీవీ స్పెషల్ ఫోకస్..
మన దేశీయ వైన్స్ షాపుల వద్ద జైలు ఊచల లెక్కన ఐరన్ రాడ్స్ ఉంటాయి. మందుబాబులు ఏదో ఖైదుల వలె అందులో చేయి దూర్చి.. సరుకు తీసుకోవాలి. పండుగనో, వీకెండో వస్తే.. క్యూలు కట్టాలి. ఎగబడలి. ఎవరైన తోసేస్తే పడకుండా నిలబడాలి. అదే విదేశీ వైన్ మార్టులకు వెళ్తే.. ఏం చక్కా డిమార్టులో తిరిగినట్టు తిరుగుతూ నచ్చిన సరుకు తీసుకోవచ్చు..
వస్తువుల్లోనే కాదు మందు విషయంలోనూ విదేశీ క్రేజ్ మాములుగా లేదు. అది ఎలా ఉన్నా పర్వలేదు ఫారన్ అయితే చాలు అంటూ మందుబాబులు ముచ్చటపడుతున్నారు. విదేశీ మద్యం షాపులు కూడా హంగూ ఆర్భాటాలతో సగం కిక్కు ఎక్కిస్తున్నాయి. ఇలాంటి విదేశీ వైన్ మార్టులు హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో కుప్పలు తెప్పలుగా వెలిశాయి.
కొత్త టేస్ట్ దొరికిందో.. లేదంటే.. విదేశీ సరుకు తాగామన్నా బిల్డప్ కోసమో.. తెలియదు కానీ వీదేశీ మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. ఇదే నిజమని ఎక్సైజ్ శాఖ అధికారుల లెక్కలు రుజువు చేస్తున్నాయి. రేట్ ఎత్తైనా డోన్ట్ కేర్ అంటున్నారు. విదేశీ సరుకు తాగాల్సిందే.. స్వదేశంలో ఊగాల్సిందే అంటున్నారు.
విదేశీ మద్యం మోజు పెరగడానికి కారణం కూడా లేకపోలేదు. కొన్ని లోకల్ బ్రాండ్స్ లో కల్తీ ఎక్కువైపోయింది. అందుకే చాలా మంది ఫారన్ సరుకు కావాలనుకుంటున్నారు. ప్రస్తుతం తాగి ఊగడం కూడా ఫ్యాషన్ అయిపోయింది. అందుకే మందుబాబులు ఫారన్ మంత్రం పదే పదే జపిస్తున్నారు. వైన్ మార్టుల వైపు పరుగులు తీస్తున్నారు. జేబులు ఖాళీ చేసుకుంటున్నారు.