Free Treatment for Corona Patients: హెచ్ హెచ్ పౌండేషన్ ఆధ్వర్యంలో కోవిడ్ బాధితులకు ఉచిత చికిత్స
Free treatment for Corona Patients: రాష్ట్రంలో కరోన పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపద్యంలో ఆస్పత్రుల్లో బెడ్స్ దొరకని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఆక్సిజన్ అందక కోవిడ్ రోగులు మరణించిన దాఖలాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తామున్నామంటూ హెల్పింగ్ హ్యండ్ పౌండేషన్ కోవిడ్ రోగులపాలిట ప్రాణదాతగా నిలుస్తోంది. పేద రోగులకు ఉచితంగా చికిత్స అందివ్వడంతో పాటు ఆక్సీజన్ కూడ సరఫరా చేస్తోంది.
కోవిడ్ రోగులు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య శ్వాస ఆడకపోవడం, సరిపడ ఆక్సిజన్ అందని సందర్బాల్లో చాలా మందికి వైరస్ ప్రాణాంతంకంగా మారుతోంది. కొన్ని సందర్బాల్లో అక్కడక్కడ ఆక్సిజన్ అందక మృతి చెందారు. ఇలాంటి కారణాలతో ఎవరు మృత్యువాత పడకూడదని హెల్పింగ్ హ్యండ్ పౌండేషన్ ఇప్పంటి వరకు 125 మంది కోవిడ్ రోగులకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేసింది. వారిలో 75 మంది ఇప్పటికే వ్యాది నుంచి కోలుకున్నారు. అలాగే హోం ఐసోలేషన్ లో ఉన్నవారికి అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో పూర్తి మెడికేషన్ తో కూడిన ఆక్సిజన్ థెరపిని అందిస్తున్నారు.
15 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ పౌండేషన్ ఎన్నో సేవల్ని అందిస్తోంది 20 ఆంబులెన్స్ లతో పేద రోగులకు హస్పిటల్లలో అడ్మిట్ చేసి వారికి ఉచితంగా చికిత్సనందిస్తున్నారు. ఇపుడు కరోన ప్రబలడంతో ఎంతో మందికి చికిత్స అందించి సేవలు చేస్తున్నారు. పౌండేషన్ వాలంటీర్లు స్వయంగా బాధితుల ఇంటికి వెళ్ళి ఆక్సిజన్ సిలండర్లు సరఫరా చేస్తున్నారు. రోగి పూర్తిగా కోలుకునే వరకు ఆక్సిజన్ ను నిరంతరంగా అందిస్తున్నామని సంస్థ నిర్వహకులు చెప్తున్నారు. దాంతో పాటు చికిత్స అవసరమైన వారికి ఉచితంగా తమ ఫౌండేషన్ ఆంబులేన్స్ లో ఆస్పత్రికి తరలిస్తున్నారు. సిబ్బందికి అవసరమైన పీపీఈ కిట్లు కూడ తామే అందిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ పరిధిలో ఉచిత కోవిడ్ సలహాలతో పాటు ఆక్సిజన్ సిలండర్లు అవసరమైన వారు తమని సంప్రదిస్తే సంస్థ డాక్టర్ల ఆద్వర్యంలో చికిత్సనందిస్తామని సంస్థ నిర్వహకులు తెలియజేసారు. కరోన విజృంభన ప్రారంభమైనప్పటి నుంచి హస్పిటల్లలో వైద్యం అందక ఎంతోమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అలాంటి వారికి హెచ్ హెచ్ పౌండేషన్ ఉచిత సేవల్ని అందించి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.