Free Services for Oxygen: ఆక్సిజన్ అవసరమైతే ఫోన్ చేయండి.. సికింద్రాబాద్ నియోజకర్గంలో ఉచిత సేవలు

Free Services for Oxygen: కరోనా మహమ్మారి వల్ల ఎన్ని అనర్ధాలు వస్తున్నాయో తెలియడం లేదు.

Update: 2020-08-12 01:44 GMT
Free Services for Oxygen

Free Services for Oxygen: కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఎన్ని అనర్ధాలు వస్తున్నాయో తెలియడం లేదు. ఈ రోగులకు అత్యవసర సమయాల్లో ఆక్సిజన్ అందక చనిపోయిన ఘటనలు ఉన్నాయి. ఇంటి వద్ద వైద్యం పొందుతున్న వారు వీటిని కొనలేక చివరకు ప్రాణాలు వదులు కోవాల్సి వస్తోంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు డిఫ్యూటీ స్పీకర్ పద్మారావు తనయుడు ఉచిత ఆక్సిజన్ పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ అవకాశాన్ని సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.

ఇటీవల అత్యవసర సందర్భాల్లో ఆక్సిజన్‌ సిలిండర్లు లభించకపోవడంతో కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఆక్సిజన్‌ అందక మృత్యువాత పడుతున్న తరుణంలో టీఆర్‌ఎస్‌ యువనాయకుడు, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు తనయుడు రామేశ్వర్‌గౌడ్‌ ఉచితంగా ఆక్సిజన్‌ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని సికింద్రాబాద్‌లోని తన నివాసంలో పలువురు నాయకులతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ మేరకు తన నివాసంలో ఆక్సిజన్‌ సిలిండర్లను తన సొంత డబ్బులతో సమకూర్చి సిద్ధం చేసుకుని అత్యవసర సందర్భాల్లో రోగులకు ఈ ప్రాణ వాయువును ఉచితంగా అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

సికింద్రాబాద్‌ నియోజకవర్గ ప్రజలకు ఉచితంగా ఆక్సిజన్‌ను అందిస్తామని, అవసరమైన వారు నేరుగా 99591 53855 నంబర్‌ను సంప్రదించాలన్నారు. సికింద్రాబాద్‌ నియోజకవర్గానికి చెందిన అడ్డగుట్ట, మెట్టుగూడ, తార్నాక, సీతాఫల్‌మండి, బౌద్ధనగర్‌ డివిజన్లకు చెందిన వారు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలన్నారు. లాక్‌డౌన్‌ సందర్భంగా పద్మారావు జంటనగరాలకు చెందిన 12 వేలకు పైగా కుటుంబాలకు నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేశారు. తన సొంత డబ్బులతో పద్మారావు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించగా, పేదల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ ప్రేరణతోనే ఆక్సిజన్‌ సిలిండర్లను అత్యవసర సందర్భాల్లో ఉచితంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు రామేశ్వర్‌గౌడ్‌ వివరించారు.


Tags:    

Similar News