Free Rice for Ration Card Holders: ఉచిత బియ్యానికి బ్రేక్?

Free Rice for Ration Card Holders: తెలంగాణలో రేషన్ కార్డు దారులకు సరఫరా చేస్తున్న ఉచిత బియ్యానికి బ్రేక్ పడింది.

Update: 2021-06-13 04:14 GMT

Free Rice distribution in Telangana: (The Hans India)

Free Rice for Ration Card Holders: కరోనాలో కరువు లేకుండా రేషన్ బియ్యాన్ని అందించాలి. కాని కరోనా కారణంగా వాహనాలు లేక ఐదు రోజులకే రేషన్ బియ్యం సరఫరా ఆగిపోయింది తెలంగాణలో. దీని వలన రేషన్ పంపిణీకి బ్రేక్ పడింది. లాక్ డౌన్ లో ఉన్న జనం రేషన్ అందక నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఏదో ఒకటి చేసి రేషన్ సరఫరా అయ్యేలా చూడాలని వారంతా కోరుతున్నారు. ఇంకా లక్షల మంది తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులు ఉచిత రేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే డీలర్లు డీడీలు చెల్లించి ఉన్నప్పటికీ.. బియ్యం మాత్రం ఇంకా రావడం లేదు. దీంతో రేషన్ షాపుల్లో బియ్యం నో స్టాక్ అంటూ బోర్డులు పెడుతున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో తెల్ల రేషన్ కార్డులోని ప్రతీ లబ్ధిదారునికి 15 కిలోల బియ్యాన్ని పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. జూన్ కోటా కింద మొత్తం 4.31 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉన్నాయి. అయితే యాసంగిలో ఎఫ్‌సీఐ బియ్యం నిల్వలు ఖాళీ చేయకపోవడంతో స్థానికంగానే అందుబాటులో బియ్యం ఉన్నాయి. ప్రతీ సారీ బియ్యం సరిపోకపోవడంతో రేషన్ పంపిణీ నిలిపివేస్తారు. కానీ ఈసారి పుష్కలంగా బియ్యం ఉన్నా.. వాటిని సరఫరా చేసే లారీలు లేవంటూ ప్రభుత్వం చేతులెత్తేస్తోంది.

ఈ నెల పాత తరహాలోనే రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా చేశారు. అయితే అంచనాకు మించి రావడం, ఒక్కొక్కరికి ఎక్కువ కిలోలు ఇవ్వాల్సి రావడంతో బియ్యం రెండు, మూడు రోజులకే పూర్తయ్యాయి. రేషన్ దుకాణాల్లో నిల్వలు మొత్తం పూర్తయ్యాయి. దీంతో మళ్లీ బియ్యం కోసం ఇండెంట్ పెట్టారు. బియ్యం లేకపోవడంతో కార్డుదారులకు పంపిణీ ఆగిపోయింది. ప్రస్తుతం బియ్యం వస్తేనే సరఫరా చేస్తామంటూ డీలర్లు చెప్పుతున్నారు. ఏది ఏమైనప్పటికీ చెప్పిన దానికి, చేసే దానికి పొంతన లేకుండా ఉంటోందని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News