Hyderabad: యూరప్‌లో ఉద్యోగాలంటూ.. ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.5 నుంచి రూ.10 లక్షలు వసూలు
Hyderabad: కన్సల్టెన్సీలపై చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్న బాధితులు
Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి కన్సల్టెన్సీల మోసాలు వెలుగులోకి వచ్చాయి. యూరప్‌లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు వల వేస్తూ... ఒక్కొక్కరి వద్ద నుంచి 5 నుంచి 10 లక్షలు వసూలు చేస్తున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు వసూలు చేసినా.. యూరప్‌కు పంపకుండా మోసం చేశారని అంటున్నారు. యూరప్‌లో ఉద్యోగాలంటూ యూట్యూబ్‌లో వీడియోలతో... ఆకర్షనీయమైన ప్రకటనలో యువతకు గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. కన్సల్టెన్సీల మెసాలపై డీజీపీకి బాధితులు ఫిర్యాదు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వంద మందికిపైగా బాధితులు కన్సల్టెన్సీలను నమ్మి మోసపోయినట్లు తెలుస్తోంది. నకిలీ కన్సల్టెన్సీలపై చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసులను వేడుకుంటున్నారు.