Foundation for Neera cafe on Necklace Road: నక్లెస్ రోడ్డులో నీరా కేఫ్.. రూ. 3 కోట్లు మంజూరు చేసిన టి. సర్కార్

Foundation for Neera cafe on Necklace Road: కాఫీ కేఫ్, టీ కేఫ్ మాదిరిగానే ఇక నుంచి హైదరాబాద్ లో నీరా కేఫ్ రానుంది.

Update: 2020-07-18 04:15 GMT

Foundation for Neera cafe on Necklace Road: కాఫీ కేఫ్, టీ కేఫ్ మాదిరిగానే ఇక నుంచి హైదరాబాద్ లో నీరా కేఫ్ రానుంది. దీనికి తెలంగాణా ప్రభుత్వం రూ. 3కోట్లు మంజూరు చేసింది. ఈ నెల 23న దీనిని ప్రారంభించేందుకు మంత్రి శ్రీనివాస గౌడ్ తో పాటు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గౌడ వృత్తిదారుల సంక్షేమం కోసం ప్రతిష్ఠాత్మకంగా నీరా పాలసీ ని ప్రవేశపేట్టారని రాష్ట్ర అబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. అందులో భాగంగా భారతదేశంలో అత్యంత అధునికరమైన నీరా కేఫ్ ను హైదరాబాద్ లోని నెక్లేస్ రోడ్ లో 3 కోట్ల రూపాయల నిధులతో నిర్మించటానికి ఈ నెల 23 న శంకుస్థాపన చేయటానికి నిర్ణయించారు మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్. శంకుస్థాపన కార్యక్రమము లో భాగంగా రాష్ట్ర మంత్రి శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్, గౌడ సామాజిక ప్రజాప్రతినిధులు మరియు గౌడ సంఘాల నాయకులతో రవీంద్రభారతి లోని తన కార్యాలయంలో ముందస్తు ఏర్పాట్ల పై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో హైదరాబాద్ మహానగరంలో నెక్లేస్ రోడ్డు లో నిర్మిస్తున్న భారతదేశంలోనే అత్యంత అధునిక నీరా కేఫ్ ప్రతిపాదిత నమూనా ను మంత్రి పరిశీలించారు. అనంతరం ప్రతిపాదిత నమూనా ను హజరైన ప్రజాప్రతినిధులు, గౌడ సంఘాల నాయకులతో చర్చించారు. శంకుస్థాపన కార్యక్రమములో నిర్వహణ కార్యక్రమాలపై మంత్రి చర్చించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్న గౌడ సామాజిక వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కుల సంఘాల నాయకులను ప్రత్యేకంగా మంత్రి అహ్వానించాలని నిర్ణయించారు. అందులో భాగంగా శాసన సభ డిప్యూటి స్పీకర్ తీగుళ్ల పద్మరావు గౌడ్, శాసన మండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, గంగాధర్ గౌడ్ , శాసన సభ్యులు ప్రకాష్ గౌడ్ , వివేకనంద గౌడ్ గారు, ఛైర్మన్ లు రాజేషం గౌడ్, నాగేందర్ గౌడ్, మజీ శాసన మండలి ఛైర్మన్ స్వామి గౌడ్, మాజీ పార్లమెంట్ సభ్యులు డా. బూర నర్సయ్య గౌడ్, జిల్లా పరిషత్ ఛైర్మన్ లు, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లెలక్ష్మణ్ రావు గౌడ్ మరియు మాజీ శాసన మండలి సభ్యులు, మాజీ శాసన సభ్యులు, మాజీ ఎంపీలు మరియు ఎన్నో ఎళ్ళు గా గౌడ సామాజిక వర్గానికి సేవలు అందిస్తున్న నాయకులు మరియు జెఎసి నాయకులు ఈ కార్యక్రమము లో ఇదే ఆహ్వానంగా భావించి కోవిడ్ నిబందనలను దృష్టి లో పెట్టుకోని వివిధ సంఘాల అధ్యక్ష , కార్యదర్శులు మాత్రమే పాల్గోనాలని మంత్రి కోరారు.

గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అదేశాల మేరకు భారతదేశంలో అత్యంత అధునికమైన నీరా స్టాల్ ను హైదరాబాద్ నగరంలో ఎంతో విలువైన ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవటం తో పాటు నీరా పాలసీ ని ప్రవేశ పేట్టి నీరా ను ఉత్పత్తి చేయటానికి గీత వృత్తి దారులకు మాత్రమే గీసుకోవటానికి అనుమతి ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ సందర్బంగా కృతజ్ఢతలు తెలిపారు మంత్రివి. శ్రీనివాస్ గౌడ్. సి ఎం కెసిఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో కుల వృత్తులకు పూర్వ వైభవం కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. అన్ని కుల వృత్తుల ఆత్మగౌరవం కోసం వేల కోట్ల విలువైన భూములను కేటాయించారన్నారు. తరతరాలుగా లక్షలాది మంది కార్మికులు చెట్లు పన్ను ను ప్రభుత్వానికి చెల్లించినా చివరకి సమైఖ్య రాష్ట్రంలో గీత వృత్తిని నిషేదించాలని కుట్రలు చేసారన్నారు.

నేడు గీత వృత్తికి పూర్వ వైభవం తీసుకరావటానికి ప్రతిష్టాత్మకంగా నీరా పాలసీ ని ప్రవేశ పేట్టి గీత వృత్తిదారులకు అండగా ప్రభుత్వం నిలిచిందన్నారు మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్. రాష్ట్రంలో ప్రతి గౌడ సోదరుడు కనీసం మూడు ఈత, తాటి మరియు గిరుక తాళ్ళు ( డాలర్ ట్రీ ) లను నాటి గీత వృత్తి ని కాపాడుకోవాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమములో శాసన మండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఫైనాన్స్ ఛైర్మన్ రాజేషం గౌడ్, రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు పల్లే లక్ష్మణ్ గౌడ్, గౌడ ఐక్య సాదన సమితి రాష్ట్ర అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్,పర్యాటక శాఖ ఎం డి మనోహర్ , టూరిజం అధికారులు అశోక్ మరియు తదితరులు పాల్గోన్నారు.


Tags:    

Similar News