పలుకుబడి వున్నంత కాలం ప్రజాప్రతినిధుల కేసులు దాచారు : మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్

Update: 2020-10-17 07:44 GMT

ప్రజాప్రతినిధులు పై వున్న కేసులు సత్వర విచారణకు సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడం మంచి నిర్ణయం అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసులు సత్వర విచారణ తీసుకురావడాన్ని అభినందిస్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ కు లేఖ రాశానని తెలిపారు. పలుకుబడి వున్నంత కాలం ప్రజాప్రతినిధుల కేసులు దాచేవారని, ఇప్పటికైనా విచారణకు సుప్రీంకోర్టు చర్యలు చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఇపుడు చంద్రబాబు ఓటుకు నోటు కేసు ట్రయల్ కు వస్తుందని ఆయన తెలిపారు. సీఎం జగన్ ముద్దాయిగా ట్రయల్ కు నడవబోతున్నారని ఆయన అన్నారు. వర్చువల్ కోర్టులో కేసులు వాదించాలని ఆయన కోరారు. ఏపీ ప్రజాప్రతినిధులు కేసులు విచారణ లైవ్ టెలికాస్ట్ పెట్టాలని ఆయన కోరారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ కు లేఖలో ఈ అంశం రాశానని ఆయన స్పష్టం చేసారు. లైవ్ టెలికాస్ట్ పెడితే అనేక మంది ఖర్చు భరించడానికి ముందుకు వస్తారని ఆయన అన్నారు.

కోర్టులో జరిగింది జరిగినట్లు చూపిస్తే ప్రజలలో కేసులపై అవగాహన వస్తుందని అన్నారు. సీఎంగా సంజీవయ్య ఉన్న సమయంలోనే న్యాయమూర్తులపై ఇలాగే ఒక లేఖ రాశారని ఆయన తెలిపారు. జగన్ రాసిన లేఖ కొత్తదేమీ కాదు సంజీవయ్య లెటర్ పై నాడు హోంమంత్రి కి రాశారన్నారు. సంజీవయ్య రాజీనామా చేసేవరకూ ఆ లేఖపై స్పందన లేదన్నారు. సంజీవయ్య రాసిన లేఖ దరిమిలా న్యాయమూర్తులు చంద్రారెడ్డి, సత్యనారాయణ రాజులను బదిలీలతో పాటు పదోన్నతులు వచ్చాయన్నారు. చీఫ్ జస్టీస్ కు రాసిన లేఖ గురించి ప్రెస్ మీట్ పెట్టి చెప్పించడం సరికాదన్నారు. ప్రజల వద్దకు ఈ అంశం వెళ్ళాలనే ఇలా చేసివుంటారన్నారు. రెడ్డి లాబీయింగ్ బలంగా వున్న సమయం కాబట్టే 1965లో ఆ న్యాయమూర్తుల విషయంలో అలా చేశారన్నారు. జడ్జిమెంట్ల విషయంలో న్యాయమూర్తుల ప్రమేయం వుంటుందని నేను విశ్వసించనని అన్నారు.

Tags:    

Similar News