సరస్వతి ‌పుత్రునికి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చేయూత

కష్టాల్లో ఉన్న వారికి తామెప్పుడూ తోడుగా ఉంటామని మరో సారి నిరూపించారు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. కష్టపడి చదివి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో సీటు సంపాదించిన గిరిజన సరస్వతి పుత్రునికి తన వంతు ఆర్థిక సాయం అందించారు.

Update: 2020-06-01 11:28 GMT

కష్టాల్లో ఉన్న వారికి తామెప్పుడూ తోడుగా ఉంటామని మరో సారి నిరూపించారు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. కష్టపడి చదివి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో సీటు సంపాదించిన గిరిజన సరస్వతి పుత్రునికి తన వంతు ఆర్థిక సాయం అందించారు.పూర్తి వివరాల్లోకెళితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి కి చెందిన కూరాకుల మహేష్ నిరుపేద కుటుంబానికి చెందిన సరస్వతి పుత్రుడు. అతని తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా పని చేస్తూ మహేశ్ ను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని అర్ధం చేసుకున్న మహేశ్ ఉన్నత స్థాయికి ఎదగాలని కష్టపడి చదివి ఐఐఎం రాంఛీలో సీటు సంపాదించాడు.

కాగా ఆ సీటును ఖరారు చేసుకోవడానికి ముందుగా రూ. లక్ష రూపాయలు అడ్మిషన్ ఫీజు చెల్లించాల్సిన సరిస్థితి నెలకొంది. కానీ నిరుపేద కుటుంబానికి చెందిన మహేష్ కు అంత డబ్బు చెల్లించడం భారంగా మారింది. ఒక వైపు ఉన్నత చదువులు చదివే మంచి అవకాశం, మరో వైపు ఫీజు చెల్లించాల్సిన తేదీ దగ్గర పడుతుండటంతో మహేష్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిలో ఉండిపోయాడు. అన్ని దారులు మూసుకుపోవడంతో తన చదువుకు సాయం ‌చేయాల్సిందిగా మాజీ ఎంపీ ‌కవితను ట్విట్టర్ ద్వారా కోరారు. ఆ ట్వీట్ ని చూసిన కవిత వెంటనే స్పందించి మహేష్ అడ్మిషన్ ఫీజు చెల్లించేందుకు ముందుకు వచ్చారు. మహేశ్ ను స్వయంగా కవిత కలిసి శుభాకాంక్షలు తెలిపి అతనికి లక్ష రూపాయల చెక్కుని అందించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ ఉన్నత లక్ష్యాలను సాధించాలనుకునే యువకులకు, విద్యార్థులకు పేదరికం అడ్డంకి కాదన్నారు. ఇందుకు నిదర్శనం మహేష్ అని ఆమె కొనియాడారు. వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన మహేష్ ఐఐఎంలో సీటు సాధించడం పట్ల అభినందించి, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అడిగిన వెంటనే స్పందించి, ఉన్నత ‌చదువులకు సహకరించినందుకు, మహేష్ ‌కుటుంబ సభ్యులు మాజీ ఎంపీ ‌కవిత గారికి కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News